Jammu: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు వీరమరణం..!

అతన్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని ఆర్మీ తన అధీనంలోకి తెచ్చుకునేందుకు చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.

Jammu: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు వీరమరణం..!
Encounter In Jammu
Follow us
Jyothi Gadda

|

Updated on: May 05, 2023 | 4:50 PM

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా కాండీ ప్రాంతంలో ఈ ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో, ఉగ్రవాదులు పేలుడు పరికరాన్ని పేల్చారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించారు. భారత ఆర్మీ ప్రకటన మేరకు..రాజౌరీ సెక్టార్‌లోని కంది అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందడంతో.. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల మధ్య సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఒక గుహలో ఉన్న ఉగ్రవాదులతో సెర్చ్ టీమ్ సంప్రదింపులు జరిపింది. ఈ ప్రాంతం రాళ్లు, ఏటవాలు కొండలతో దట్టంగా ఉంది. ఆ తర్వాత భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు పేలుడు పదార్థాన్ని పేల్చారు. దాంతో ఐదుగురు సైనికులు మరణించారు. మరొకరు గాయపడ్డారు అని ఆర్మీ పేర్కొంది.

గాయపడిన సిబ్బందిని ఉదంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తరలించామని, సమీపంలోని అదనపు బృందాలను ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి తరలించామని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల బృందం దాగి ఉంది. ఉగ్రవాదుల్లోనూ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, రాజౌరి జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు అధికారులను ఉటంకిస్తూ పిటిఐ నివేదించింది.

గురువారం, దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌భేరా ప్రాంతంలో భద్రతా దళాలపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సమయంలో ఒక పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని ఆర్మీ తన అధీనంలోకి తెచ్చుకునేందుకు చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?