Gold Seize: తెలివిగా బంగారం దేశం దాటించారు..చివరకు అధికారులకు దొరికిపోయారు ఇలా..

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టబడింది. అక్టోబర్ 10వ తేదీన ముంబై నుంచి యుకె823 విమానంలో చెన్నైకు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల బ్యాగులను తనిఖీచేయగా.. వారివద్ద నున్న చేతి సంచిలో..

Gold Seize: తెలివిగా బంగారం దేశం దాటించారు..చివరకు అధికారులకు దొరికిపోయారు ఇలా..
Chennai Air Customs officials seized Gold
Follow us

|

Updated on: Oct 12, 2022 | 8:29 AM

ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి లెక్కలు లేకుండా అనధికారికంగా బంగారం తరలిస్తున్నారు కొంతమంది. విమానాల్లో ప్రయాణం చేస్తూ తమ తెలివితేటలను ఉపయోగించి కోట్ల రూపాయల విలువచేసే బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టబడింది. అక్టోబర్ 10వ తేదీన ముంబై నుంచి యుకె823 విమానంలో చెన్నైకు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల బ్యాగులను తనిఖీచేయగా.. వారివద్ద నున్న చేతి సంచిలో 27 బంగారు బిస్కట్లను అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 27 బంగారు బిస్కట్ల బరువు 2.7 కిలోలు ఉన్నట్లు ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.1.18 కోట్లు ఉంటుందన్నారు. బంగారు బిస్కట్లపై విదేశీ గుర్తులు ఉన్నాయని, బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో చెన్నై విమానాశ్రయంలో చాలా మంది ప్రయాణీకుల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు తమ తనిఖీల్లో గుర్తించి వాటిని స్వాధీనం చేసకుంటున్నారు.

అక్టోబర్ 10వ తేదీన మలేసియా నుంచి చెన్నై వచ్చిన మరో ఇద్దరు మహిళా ప్రయాణీకుల నుంచి కూడా భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎకె11 విమానంలో మలేసియా నుంచి ఇద్దరు మహిళా ప్రయాణికులు చెన్నై అంతర్జాతీయ విమానశ్రయంలో దిగారు. వీరు అత్యవసర ఎమెర్జెన్సీ లైట్ (ఛార్జింగ్ లైట్) లో బంగారాన్ని పెట్టి తీసుకురాగా. అధికారుల తనిఖీలో విషయం బయటపడింది.

ఛార్జింగ్ లైట్ ఓపెన్ చేసి చూడగా.. లోపల బంగారు ప్లేట్ లను గుర్తించారు. దాదాపు 1.8 కిలోల బరువు ఉండగా, వీటి విలువ రూ.79.44 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎమర్జెనీ ల్యాంప్ తో పాటు అందులోని బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు మహిళా ప్రయాణీకులను అరెస్ట్ చేశామని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

చెన్నై అంతర్జాతీయ విమనాశ్రయంలో కస్టమ్ అధికారుల తనిఖీల్లో పట్టుడిన బంగారం

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..