POCSO Act: పోక్సో చట్టం కింద మూడేళ్లలో 4.12 లక్షల అత్యాచార కేసులు: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

POCSO Act: చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద మూడేళ్లలో 4,12,142 అత్యాచార కేసులు నమోదైనట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ...

POCSO Act: పోక్సో చట్టం కింద మూడేళ్లలో 4.12 లక్షల అత్యాచార కేసులు: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
Follow us
Subhash Goud

|

Updated on: Feb 05, 2021 | 9:49 AM

POCSO Act: చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద మూడేళ్లలో 4,12,142 అత్యాచార కేసులు నమోదైనట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. గురువారం రాజ్యసభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 35 (2) ప్రకారం నేరం జరిగిన ఏడాది లోపు ప్రత్యేక కోర్టులు కేసుల విచారణ పూర్తి చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 1,023 పాస్ట్‌ ట్రాక్‌ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి ఓ పథకం అమలు చేస్తోందని అన్నారు. అందులో 389 కోర్టులు కేవలం పోక్సో చట్టానికి సంబంధించిన కేసుల విచారణకే కేటాయిస్తున్నామని అన్నారు.

2020 డిసెంబర్‌ వరకు 609 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు పని చేస్తున్నాయని, అందులో పోక్సో చట్టానికి సంబంధించినవి 331 ఉన్నాయని స్మృతి ఇరానీ తెలిపారు. కాగా, దేశంలో బాలికలపై, మహిళపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడిన కామాంధులను కటకటాల వెనక్కి నెట్టినా.. ఇలాంటి వారిలో మార్పు రావడం లేదు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని పోక్సో చట్టం కింద విచారణ త్వరగా పూర్తి చేసి శిక్షలు వేస్తున్నారు. చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

Also Read:

ఇందిరాగాంధీ హయాంలో ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తే.. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణ

Government Blocked 296 Mobile Apps: దేశంలో 296 మొబైల్‌ యాప్‌లను నిషేధించాం: కేంద్ర మంత్రి సంజయ్‌ దోత్రే

India vs England, 1st Test, Day 1 LIVE Score: తొలి టెస్ట్ సమరం.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్.

తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..