Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లోని కోర్బా జిల్లాలో దారుణం.. బాలికపై అత్యాచారం.. ముగ్గురి హత్య

6 arrested after girl raped: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి (55) తన 16 ఏళ్ల కుమార్తె, 4 ఏళ్ల మనవరాలిని తీసుకొని వస్తుండగా ఆరుగురు యువకులు అడ్డుకొని వారిని కొట్టి బాలికపై సామూహిక..

Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లోని కోర్బా జిల్లాలో దారుణం.. బాలికపై అత్యాచారం.. ముగ్గురి హత్య
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 05, 2021 | 10:18 AM

6 arrested after girl raped: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి (55) తన 16 ఏళ్ల కుమార్తె, 4 ఏళ్ల మనవరాలిని తీసుకొని వస్తుండగా ఆరుగురు యువకులు అడ్డుకొని వారిని కొట్టి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటన జనవరి 29న ఛత్తీస్‌ఘడ్ కోర్బా జిల్లాలోని లెమ్రూ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్రెంగా గ్రామ సమీపంలో జరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఓ వ్యక్తి తన కుమార్తె, మనవరాలిని తసుకొని ద్విచక్రవాహనంపై కోరాయి గ్రామానికి వెళుతుండగా.. మద్యం తాగిన ఆరుగురు యువకులు వారిని ఆపి కొట్టి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారిని రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు. వారి ఆచూకీ లేకపోవడంతో మృతుడి కుమారుడు ఫిబ్రవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలించగా.. సంఘటనా స్థలంలో తండ్రి, మనవరాలు మరణించి ఉన్నారు. అత్యాచారానికి గురైన బాలిక తీవ్ర గాయాలతో పడి ఉండగా ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది.

అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంద్రం మజ్వార్, అబ్దుల్ జబ్బార్, అనిల్ కుమార్ , రామ్ పానికా, ఆనంద్ రాం పానికా, శంకర్ యాదవ్ ఈ దారుణానికి పాల్పడ్డారని తేలడంతో వారిపై ఐపీసీ సెక్షన్ 302, 376(2) జి, ఎస్సీఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

Also Read: