Nalgonda Honour Killing: నల్గొండ జిల్లాలో దారుణ ఘటన.. ప్రేమ వివాహం చేసుకున్న యువకుని పై యువతి బంధువులు దాడి…
ఉమ్మడి నల్గొండ జిల్లాకు పరువు హత్యలకు ఏదో సంబంధం ఉన్నట్లుండి. ఆ జిల్లాను పరువు హత్యలు వీడడం లేదు. గత మూడేళ్ళ క్రితం జరిగిన ప్రణయ్ హత్య ఇంకా జనం మరచిపోలేదు.. తాజాగా మరో పరువు కోసం హత్యాయత్నం..
Nalgonda Honour Killing: ఉమ్మడి నల్గొండ నల్గొండ జిల్లాలో మరోదారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు పరువు హత్యలకు ఏదో సంబంధం ఉన్నట్లుండి. దా్ంతో జిల్లాను పరువు హత్యలు వీడడం లేదు. గత మూడేళ్ళ క్రితం జరిగిన ప్రణయ్ హత్య ఇంకా జనం మరచిపోలేదు.. తాజాగా మరో పరువు కోసం హత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్నాడని ఓ యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే..
గరిడేపల్లి మండలంలోని మర్రికుంట కు చెందిన వినయ్, పెన్ పహాడ్ కు చెందిన రుచిత గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ కులాలు వేరుకావడంతో పెద్దలు అంగీకరించరని భావించిన ఈ జంట బుధవారం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు వినయ్ సహా రుచితలపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వినయ్, రుచిత లను ఖమ్మం లోని ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆ దంపతులకు ICU లో ఉంచి చికిత్సనందిస్తున్నారు. ఇద్దరికీ ప్రాణాపాయం లేదన్న వైద్యులు చెప్పారు. అయితే వినయ్ తల్లిదండ్రులు తమ కోడలు బంధువులతో తన కొడుక్కి ప్రాణాపాయం వుందంటూఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై రుచిత రెండు రోజుల ముందే పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: