ఆదిలాబాద్‌లో మహిళా వేధింపులకు బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు..

BSF Jawan Commits Suicid: eఓ మహిళా వేధింపులు తట్టుకోలేక జవాన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకంది.

ఆదిలాబాద్‌లో మహిళా వేధింపులకు బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు..
Follow us
uppula Raju

|

Updated on: Feb 05, 2021 | 8:30 AM

BSF Jawan Commits Suicid: ఓ మహిళా వేధింపులు తట్టుకోలేక జవాన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకంది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీంపూర్‌ మండలంలోని బెల్సరీ రాంపూర్‌ గ్రామానికి చెందిన గెడాం మారుతి మేఘాలయలోని 11వ బెటా లియన్‌లో బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గత నెలలో సెలవుపై సొంత ఊరుకు వచ్చాడు. అయితే గతంలో పరిచయం ఉన్న ఓ మహిళ మారుతిని ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సమీప బంధువుతో కలిసి వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగా మారుతి ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

India vs England 1st Test live streaming: నేటి నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం.. వీక్షించండి ఇలా.!