Sikkim Earthquake: నేపాల్-ఇండియా సరిహద్దు సిక్కింలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై ఎంత నమోదైందంటే..
Sikkim Earthquake: నేపాల్- భారత్ సరిహద్దుల్లోని సిక్కింలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవిచింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైనట్లు జాతీయ సిస్మాలజీ ..
Sikkim Earthquake: నేపాల్- భారత్ సరిహద్దుల్లోని సిక్కింలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైనట్లు జాతీయ సిస్మాలజీ కేంద్రం అధికారులు వెల్లడించారు. భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురై కొండ ప్రాంతాలపై ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సిక్కిం అధికారులు తెలిపారు.
కాగా, ఈ మధ్య కాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోయినా.. జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి భూప్రకంపనలు సంభవిస్తుంటే.. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు భూకంపాలు చోటు చేసుకోవడంతో ఆందోళన కలిగిస్తోంది.