మరో దారుణం.. పెళ్లైన 36 రోజులకే భర్తకు విషంపెట్టి చంపిన భార్య..ఎక్కడంటే..
సోనమ్-రాజా రఘువంశీ తరహాలోనే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ వివాహం చేసుకున్న 36 రోజులకే తన భర్తను హత్య చేసింది. 22 ఏళ్ల మహిళ తన భర్తకు విషం ఇచ్చి చంపిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.. మృతుడి తల్లి ఫిర్యాదు ఆధారంగా అతని భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

కొన్ని రోజుల క్రితం మేఘాలయలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మేఘాలయా హనీమూన్ కోసం వెళ్లిన నవ వరుడు రాజా రఘవంశీ అక్కడే దారుణ హత్యకు గురయ్యాడు. నవ వధువు సోనమ్ తన భర్త రాజా రఘువంశీని రూ.20 లక్షలకు సుపారీ ఇచ్చి హత్య చేయించిందని పోలీసు విచారణలో తేలింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే జార్ఖండ్ నుంచి ఇలాంటి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన 36 రోజులకే భర్తకు విషంపెట్టి చంపింది ఒక భార్య. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం గర్హ్వా జిల్లాలో చోటు చేసుకుంది.
జార్ఖండ్‌లోని గర్హ్వాలో సోనమ్-రాజా రఘువంశీ తరహాలోనే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ వివాహం చేసుకున్న 36 రోజులకే తన భర్తను హత్య చేసింది. 22 ఏళ్ల మహిళ తన భర్తకు విషం ఇచ్చి చంపిందని పోలీసులు తెలిపారు. సునీత, బుధ్‌నాథ్ సింగ్‌కు మే 11న వివాహమైంది. వివాహం జరిగిన మరుసటి రోజే సునీత తనకు భర్త ఇష్టంలేదని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు ఆమెకు నచ్చజెప్పి కాపురానికి పంపించారు. ఈ నెల 15న భర్త తినే భోజనంలో పురుగుల మందు కలిపి పెట్టింది. బుధ్‌నాథ్ నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..జూన్ 14న భార్యాభర్తలు ఛత్తీస్‌గఢ్‌లోని రామానుజ్‌గంజ్ మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ చెట్లకు వాడే పురుగు మందులు అవసరమని చెప్పి మార్కెట్ నుండి పురుగుమందులు కొనమని సునీత బుద్ధనాథ్‌ను ఒప్పించిందని చెప్పారు. అదే పురుగు మందును జూన్ 15 రాత్రి సునీత తన భర్త ఆహారంలో పురుగుమందులు కలిపిందని పోలీసు విచారణలో గుర్తించారు. ఆ భోజనం చేసిన బుద్ధనాథ్ మరుసటి రోజు ఉదయానికి మరణించాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. మృతుడి తల్లి ఫిర్యాదు ఆధారంగా అతని భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..








