AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పామును ముద్దాడి ఫేమస్‌ అవుదామనుకున్నాడు.. కానీ… బెడిసికొట్టి ఆస్పత్రి బెడ్‌మీద కొనప్రాణాలతో.

నాగుపామును ముద్దాడుతూ తీసిన వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టి వైరల్ చేయాలనుకున్న ఓ వ్యక్తి ప్రయత్నం బెడిసికొట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. హైబత్‌పూర్‌గ్రామానికి చెందిన 50 ఏళ్ల జితేంద్ర కుమార్‌ అనే రైతు.. తనకున్న పొలంలో...

Viral Video: పామును ముద్దాడి ఫేమస్‌ అవుదామనుకున్నాడు.. కానీ... బెడిసికొట్టి ఆస్పత్రి బెడ్‌మీద కొనప్రాణాలతో.
Snake Kiss Failure
K Sammaiah
|

Updated on: Jun 17, 2025 | 8:00 PM

Share

నాగుపామును ముద్దాడుతూ తీసిన వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టి వైరల్ చేయాలనుకున్న ఓ వ్యక్తి ప్రయత్నం బెడిసికొట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. హైబత్‌పూర్‌గ్రామానికి చెందిన 50 ఏళ్ల జితేంద్ర కుమార్‌ అనే రైతు.. తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తుంటాడు. కాగా, గత శుక్రవారం రోజున గ్రామంలోని ఓ ఇంటి గోడలో కనిపించిన పామును అతడు పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా.. దానిని మెడలో వేసుకొని అందరి ముందు దానితో విన్యాసాలు చేయటం మొదలు పెట్టాడు.

అదే సమయంలో.. తన విన్యాసాలను వీడియో తీయించి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తే బాగుంటుందనే వింత ఆలోచన వచ్చింది. అదే సమయానికి అక్కడ పోగైన జనం అతడి విన్యాసాలను ఆశ్యర్యంగా చూస్తుండటంతో.. రెచ్చిపోయిన ఈ పెద్దాయన ఈసారి ఏకంగా ఆ పామును ముద్దాడే ప్రయత్నం చేశాడు. అంతే.. ఒక్కసారిగా ఆ పాము అతడి నాలుకమీద కాటేసింది.

పాము కాటేయటం చూసిన జనమంతా బిగ్గరగా హాహాకారాలు చేశారు. దీంతో అతడు పామును వదిలేయగా, అది నెమ్మదిగా అక్కడి పొదల్లోకి జారుకుంది. అంతలోనే.. జితేంద్ర కుమార్ కళ్లు తిరిగి నేల మీద పడిపోగా, గ్రామస్తులు అతడిని హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం అందించారు. మరో నాలుగైదు రోజులు గడిస్తే తప్ప ఇప్పుడే ఏమీ చెప్పలేమని వారు వెల్లడించారు. కాగా, స్టంట్‌ సమయంలో జితేంద్ర కుమార్‌ మద్యం మత్తులో ఉన్నాడని, పొగతాగుతూనే పాముతో ఆటలాడాడని స్థానికులు చెబుతున్నారు. ఇంకొందరేమో.. నడివయసు కొచ్చాక కూడా ఈ పిల్ల చేష్టలేంటని విసుక్కుంటున్నారు.

వీడియో చూడండి:

ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్