26/11 Mumbai Attacks: మానని గాయం.. ముంబై మరణహోమానికి 13 ఏళ్లు..

26/11 Mumbai Attacks: ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన 26/11 మారణహోమానికి నేటితో 13 ఏళ్లు పూర్తయింది. ఈ ఘటన ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన..

26/11 Mumbai Attacks: మానని గాయం.. ముంబై మరణహోమానికి 13 ఏళ్లు..
Follow us
Subhash Goud

|

Updated on: Nov 26, 2021 | 12:50 PM

26/11 Mumbai Attacks: ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన 26/11 మారణహోమానికి నేటితో 13 ఏళ్లు పూర్తయింది. ఈ ఘటన ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. బాధితులకు ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికే ఈ ఘటనను మర్చిపోలేకపోతున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నారు.

2008 నవంబర్‌ 26న జరిగిన మారణహోమాన్ని.. ముంబై మహానగరం ఇప్పటికీ మరిచిపోలేదు. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు సృష్టించిన నరమేథానికి 13 ఏళ్లు పూర్తయినా ఆనాటి గాయాలు ఇప్పటికీ మానలేదు. ఈ నేపథ్యంలో ముంబై నగరలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ముంబై పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేశారు. ట్రైనింగ్‌, ఆయుధాల వాడకం, ఎలాంటి సమయంలోనైనా దాడుల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టే సామర్థ్యం వంటి విషయాల్లో ఎంతో పురోగతి సాధించారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్స్, ఆయుధాల్ని పెద్ద సంఖ్యలో సమకూర్చుకున్నారు. భద్రతా సిబ్బందిని గణనీయంగా పెంచకున్నారు.

13 ఏళ్ల కిందట జరిగిన ఉగ్ర అరాచకం.. ప్రపంచ ఉగ్ర దాడుల్లోనే అత్యంత ఘోరమైన చర్యగా నిలిచిపోయింది. పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి చొరబడ్డారు లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. అజ్మల్ కసబ్ సహా 10 మంది ముష్కరులు..తాజ్‌, ఒబెరాయ్ హోటల్, చత్రపతి శివాజీ టెర్మినల్‌ దగ్గర నాలుగు రోజుల పాటు మారణకాండ సృష్టించారు. ఈ దాడిలో 166 మంది చనిపోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఇలాంటి ఉగ్రదాడి మళ్లీ జరిగే పరిస్థితే రానివ్వబోమంటున్న ముంబై పోలీసులు.. ఒకవేళ జరిగితే, అత్యంత అధునాతన ఆయుధాలతో తిప్పికొడతామంటున్నారు.

ఆ చేదు జ్ఞాపకానికి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. నాటి దాడుల్లో వీర మరణం పొందిన పోలీసులు, భద్రతా సిబ్బందికి ఘనంగా నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి:

Road Accident: కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Coal Mine Accident: సైబీరియా బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. 11మంది మృతి, పదుల సంఖ్యలో గల్లంతు!