Covid Fourth Wave: కొత్త సంవత్సరంలో కరోనా భయాలు? జనవరిలోనే ఫోర్త్ వేవ్ వచ్చేస్తుందా? కోవిడ్ పై నిపుణులు చెబుతున్న దానికి అర్థం ఏమిటి?

| Edited By: Anil kumar poka

Jan 01, 2023 | 1:29 PM

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధికమవుతున్న పాజిటివ్ కేసులు దీనికి బలం చేకూర్చుతున్నాయి. అయితే దీనిపై ముందుగానే అప్రమత్తమైన భారత ప్రభుత్వం డిసెంబర్ 24 నుంచే అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది.

Covid Fourth Wave: కొత్త సంవత్సరంలో కరోనా భయాలు? జనవరిలోనే ఫోర్త్ వేవ్ వచ్చేస్తుందా? కోవిడ్ పై నిపుణులు చెబుతున్న దానికి అర్థం ఏమిటి?
Covid
Follow us on

కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. బీఎఫ్ 7 రూపంలో మరోసారి విరుచుకుపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చైనాను అతలాకుతలం చేస్తున్న మహమ్మారి. కొత్త సంవత్సరంలో మన దేశంలో కూడా పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధికమవుతున్న పాజిటివ్ కేసులు దీనికి బలం చేకూర్చుతున్నాయి. అయితే దీనిపై ముందుగానే అప్రమత్తమైన భారత ప్రభుత్వం డిసెంబర్ 24 నుంచే అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. విమానాశ్రయాలలో భద్రత పెంచింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా ఉంచి, వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది.

మనకు ప్రమాదం తక్కువే..

అయితే చైనాలో కొత్త వేరియంట్ వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ మన దేశంలో మరో వేవ్ వ్యాప్తి చెందే అవకాశం లేకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మరో వేవ్ వచ్చినా ప్రజలను పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చని అంచనావేస్తున్నారు. చిన్నపాటి జలుబు, దగ్గు, రెండు మూడు రోజుల పాటు శ్వాసకోస ఇబ్బందులు తలెత్తే అవకాశం మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అప్రమత్తమైన రాష్ట్రాలు..

దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే పూర్తిస్థాయిలో అప్రమత్తం అయ్యాయి. కర్ణాటకలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో ఫేస్ మాస్క్ రెగ్యూలేషన్స్ ను అమలుచేస్తోంది. అలాగే టెస్ట్ ల సంఖ్య కూడా పెంచింది. ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం దేశ వ్యాప్తంగా గత మూడు రోజుల్లో 39 మంది ప్రయాణికులు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. మొత్తం కొత్త కేసులు 223 నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..