New Parliament: ఈనెల 28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం.. బహిష్కరించాలని విపక్షాలు డిమాండ్..

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 20 విపక్షాలు నిర్ణయించాయి. ప్రధాని మోదీ కాకుండా రాష్ట్రపతి ముర్ము పార్లమెంట్‌ను ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఈవిషయంపై రాజకీయం చేయకుండా ప్రారంభోత్సవానికి రావాలని విపక్షాలను ఆహ్వానించారు అమిత్‌షా

New Parliament: ఈనెల 28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం.. బహిష్కరించాలని విపక్షాలు డిమాండ్..
New Parliament Building
Follow us
Sanjay Kasula

|

Updated on: May 24, 2023 | 8:57 PM

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవంపై రగడ కొనసాగుతోంది. ఈనెల 28వ తేదీన కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. అయితే ప్రధాని కాకుండా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పార్లమెంట్‌ను ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తునట్టు 19 పార్టీలు లేఖను విడుదల చేశాయి. కొత్త పార్లమెంట్‌ను స్పీకర్‌ ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నారు మజ్లిస్‌ అధినేత ఒవైసీ. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని విపక్షాలు నిర్ణయించడం మంచి పరిణామమన్నారు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌

విపక్షాల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అన్ని విపక్షాలు ఏకం కావడం శుభపరిణామం. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలపై పోరాడడం చాలా మంచిది. కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించకుండా దారుణంగా అవమానించారన్నారు రాహుల్‌గాంధీ. ఇది రాజ్యాంగానికే అవమానమని ట్వీట్‌ చేశారు. ప్రధాని కేవలం ప్రభుత్వానికి మాత్రమే నేతృతం వహిస్తారని , రాష్ట్రపతి మాత్ర శాసన వ్యవస్థకు నేతృత్వం వహిస్తారని అంటున్నాయి విపక్షాలు. అందుకే రాష్ట్రపతి చేతుల మీదుగా కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నారు. శాసనసభాధిపతిగా స్పీకరే పార్లమెంట్‌ను ప్రారంభించాలన్నారు ఒవైసీ

లోక్‌సభ స్పీకర్‌ కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్‌సభ స్పీకర్‌ ప్రారంభిస్తే ఎంఐఎం తప్పకుండా హాజరవుతుంది. కాని బీజేపీ పట్టువీడకపోతే మేము వచ్చే ప్రసక్తే ఉండదు. 2014 కంటే ముందు ఎలాంటి అభివృద్ది జరగలేదని బీజేపీ అనుకుంటే పొరపాటన్నారు.

విపక్షాలు ఆరోపణలకు బీజేపీ కౌంటర్‌

అయితే విపక్షాలు ఆరోపణలను బీజేపీ తిప్పికొడుతోంది. పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించామని చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయమని , విపక్షాలు తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని అమిత్‌షా కోరారు. కొత్త పార్లమెంట్‌ వారసత్వ సంపద అని అన్నారు

కొత్త పార్లమెంట్‌ భవనాన్ని కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. స్పీకర్‌ కుర్చీ వెనుక ఈసారి రాజదండాన్ని పెట్టబోతున్నారు. బ్రిటీష్‌ వారు దేశ తొలి ప్రధాని నెహ్రూకు అధికారాన్ని అప్పగిస్తూ ఇచ్చిర రాజదండాన్ని కొత్త పార్లమెంట్‌లో ప్రదర్శిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం