BRICS 2026 : దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ సదస్సు!
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ సమావేశాలు ప్రారంభంమయ్యాయి. భారత మండపం వేదికగా బ్రిక్స్ సమ్మిట్ కొనసాగుతోంది.ఈ సదస్సుకు 11 సభ్య దేశాధినేతలు హాజరయ్యారు. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో కీలక ముందడుగు పడింది. బ్రిక్స్ ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. భారత నేతృత్వంలో ఈ డిక్లరేషన్‌పై సభ్య దేశాల మధ్య పూర్తి ఏకాభిప్రాయం సాధించడం విశేషం. ఈ పరిణామంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ డిక్లరేషన్‌కు సభ్య దేశాలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం ఎంతో సంతోషకరమని పేర్కొన్న ప్రధాని, ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టం చేశారు.
డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు:
సరిహద్దు వివాదాలు: దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలను శాంతియుత చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు.
అణ్వాయుధాలు – ప్రపంచశాంతి: అణ్వాయుధాల వల్ల ప్రపంచశాంతికి పెనుముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
ఏకపక్ష సుంకాలు – ప్రపంచ వాణిజ్యం: ఏకపక్ష సుంకాలు విధించడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇవి డబ్ల్యూటీవో (WTO) నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
గ్లోబల్ సౌత్: ప్రపంచ వేదికలపై గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రాధాన్యత మరింత పెరగాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
ఇంధన రంగం: సభ్య దేశాల మధ్య ఇంధన రంగంలో పరస్పర సహకారం మరింత విస్తృతం కావాలని బ్రిక్స్ డిక్లరేషన్ పిలుపునిచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
