AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రైన్‌ కోసం ఎదురుచూపులు.. ఉన్నట్టుండి ప్లాట్‌ఫామ్‌పైనే కుప్పకూలిన 13ఏళ్ల బాలిక.. అసలేం జరిగిందంటే

అనామిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డాక్టర్.. ఆమెను ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు. డిప్యూటీ ఎస్ఎస్, లేడీ కానిస్టేబుల్ బాలికను తమ ఒడిలో ఎత్తుకుని ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ వైపు పరుగెత్తారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లో అనామికను రైల్వే ఆసుపత్రికి తరలించారు. బాలికకు

ట్రైన్‌ కోసం ఎదురుచూపులు.. ఉన్నట్టుండి ప్లాట్‌ఫామ్‌పైనే కుప్పకూలిన 13ఏళ్ల బాలిక.. అసలేం జరిగిందంటే
13 year old girl got heart attack
Jyothi Gadda
|

Updated on: Oct 03, 2024 | 1:34 PM

Share

ఇటీవల కాలంలో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ లతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్న వయసు వారికి కూడా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ రావడం మరింత ఆందోలనకు గురిచేస్తోంది. తాజాగా 13 ఏళ్ల హ్యాండ్‌బాల్ ప్లేయర్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరింది. ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అదృష్టవశాత్తు రైలు ఆలస్యం కారణంగా బాలికకు ప్రాణాపాయం తప్పింది. క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు బయల్దేరిన బాలిక అనుకోకుండా ఇలా ఆస్పత్రిలో చేరింది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పటంతో స్కూల్‌ సిబ్బంది, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

లఖింపూర్ ఖేరీ నివాసి 13 ఏళ్ల అనామిక అనే బాలిక హ్యాండ్‌బాల్ ప్లేయర్. మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో జరుగుతున్న ప్రాంతీయ పాఠశాల హ్యాండ్‌బాల్ క్రీడల్లో పాల్గొనేందుకు ఆమె తన టీమ్‌తో కలిసి ఝాన్సీకి వచ్చింది. మంగళవారం అనామిక తన కోచ్ జయమతి, ఇతర తోటి క్రీడాకారిణులతో కలిసి లక్నో వెళ్లేందుకు సాయంత్రం 5.30 గంటలకు ఝాన్సీ స్టేషన్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆటగాళ్లందరూ సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాల్సి ఉంది. కానీ, వారంతా రైలు ఎక్కకముందే అనామిక అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పితో తల్లడిల్లిపోయింది. కొద్దిసేపటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది..దీంతో కోచ్ వెంటనే రైల్వేశాఖ సాయంతో బాలికను ఆస్పత్రికి తరలించారు.

రైల్వే ప్లాట్‌ఫామ్‌పై చిన్నారి అనారోగ్యానికి గురైన విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ ఎస్‌ఎస్‌, ఆర్పీఎఫ్‌ లేడీ కానిస్టేబుల్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు.  అనామిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డాక్టర్.. ఆమెను ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు. డిప్యూటీ ఎస్ఎస్, లేడీ కానిస్టేబుల్ బాలికను తమ ఒడిలో ఎత్తుకుని ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ వైపు పరుగెత్తారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లో అనామికను రైల్వే ఆసుపత్రికి తరలించారు. బాలికకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే మరో మెరుగైన ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

రైలు ఆలస్యం కారణంగానే అనామిక ప్రాణాలతో బయటపడిందని కోచ్‌ వెల్లడించారు. అనామిక ప్రయాణించాల్సిన సబర్మతి ఎక్స్‌ప్రెస్ మంగళవారం రోజున 40 నిమిషాల ఆలస్యంతో ఝాన్సీకి చేరుకుంది. అయితే అంతకుముందే అనామిక ఆరోగ్యం క్షీణించింది. రైలు సమయానికి వచ్చి ఉంటే మార్గమధ్యంలో బాలికకు వైద్యం అందడం కష్టమయ్యేదని వారు వాపోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..