Delhi: తీహార్ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ..అక్కడ ఏం జరుగుతోంది..?

తీహార్ జైలు అథారిటీ రక్షిత సర్వే విభాగం AIIMS, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌తో కలిసి మహిళా ఖైదీలకు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌ను కూడా నిర్వహించింది. దీంతో పాటు ఖైదీలకు క్షయ పరీక్షలు కూడా చేశారు. అయితే ఎవరికీ పాజిటివ్ రిపోర్ట్ రాలేదు. ఖైదీల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఢిల్లీలోని సఫ్దర్​ జంగ్​ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు, చికిత్సలు అందిస్తున్నామని డీజీ సతీష్​ గోల్చా తెలిపారు.

Delhi: తీహార్ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ..అక్కడ ఏం జరుగుతోంది..?
Tihar Jail
Follow us

|

Updated on: Jul 29, 2024 | 4:31 PM

ఢిల్లీలోని తీహార్ జైలులో వందలాది మంది ఖైదీలకు హెచ్‌ఐవీ సోకింది. 200 మంది ఖైదీలు సిఫిలిస్ లక్షణాలతో బాధపడుతున్నట్టుగా తెలిసింది. తాజాగా ఈ వార్త తెరపైకి రావడంతో ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తీహార్​ జైలులో 125మంది ఖైదీలకు హెచ్​ ఐవీ పాజిటివ్​ గా గుర్తించారు. తీహార్ జైలులో తీహార్, రోహిణి, మండోలి అనే మూడు జైళ్లు ఉన్నాయి. ఈ జైళ్లలోనే 125 మంది ఖైదీలకు హెచ్‌ఐవి సోకినట్టుగా గుర్తించారు. దీంతో జైలు నిర్వహణలో గందరగోళం నెలకొంది. తీహార్‌ జైల్లో దాదాపు 14,000 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో సుమారు 10 వేల 500 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా తీహార్​ జైలు డీజీ సతీష్ గోల్చా పలు వెల్లడించారు.

ఈ మేరకు తీహార్​ జైలు డీజీ సతీష్ గోల్చా మాట్లాడుతూ.. తాను నియమితమైన తరువాత మే, జూన్​ లలో 10,500మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో 125మంది ఖైదీలకు హెచ్​ ఐవీ పాజిటివ్​ గా తేలిందన్నారు. అయితే వీరు జైలుకు వచ్చినప్పటికే హెచ్​ ఐవీ సోకిందని వెల్లడించారు. అయితే జైలులో ఉండగా ఎవరికీ హెచ్‌ఐవీ సోకలేదని జైలు అధికారులు పేర్కొంటున్నారు. నేరస్థులు జైలుకు వచ్చినప్పుడే వారికి వైద్య పరీక్షలు చేయించారు. ఆ సమయంలో వారికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా ఎవరికీ హెచ్‌ఐవీ సోకినట్లు కాదన్నారు.

అయితే, జైలులో హెచ్‌ఐవీ బాధితుల కోసం ఏమైనా అదనపు చర్యలు తీసుకున్నారా అనే దానిపై జైలు స్పష్టత ఇవ్వలేదు. హెచ్‌ఐవీతో పాటు 200 మంది ఖైదీలు సిఫిలిస్ వంటి తీవ్రమైన చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. తీహార్ జైలు అథారిటీ రక్షిత సర్వే విభాగం AIIMS, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌తో కలిసి మహిళా ఖైదీలకు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌ను కూడా నిర్వహించింది. దీంతో పాటు ఖైదీలకు క్షయ పరీక్షలు కూడా చేశారు. అయితే ఎవరికీ పాజిటివ్ రిపోర్ట్ రాలేదు. ఖైదీల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఢిల్లీలోని సఫ్దర్​ జంగ్​ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు, చికిత్సలు అందిస్తున్నామని డీజీ సతీష్​ గోల్చా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!