171 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిన ఓడ.. తాజాగా బయటపడ్డ భారీ నిధి.. విలువెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

స్వీడెన్ సముద్రంలో మునిగిపోయిన 171 ఏళ్ల నాటి ఓడను డైవర్లు కనుగొన్నారు. ఓడలో దొరికిన వస్తువులను చూసి వారంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. పరిశోధకులు ఆ ఓడలో పురాతన షాంపైన్ వైన్, మినరల్ వాటర్, పింగాణీ వస్తువులను కనుగొన్నారు. 19వ శతాబ్దంలో మునిగిపోయిన ఓడ శిథిలాలు బాల్టిక్ సముద్రంలో దాదాపు 190 అడుగుల లోతులో గుర్తించారు.

171 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిన ఓడ.. తాజాగా బయటపడ్డ భారీ నిధి.. విలువెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
19th Century Treasure
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 29, 2024 | 4:06 PM

బాల్టిక్ సముద్రం లోతులో మునిగిపోయిన 171 ఏళ్ల నాటి ఓడను గుర్తించారు పరిశోధకులు. స్వీడన్ తీరంలో దాదాపు 190 అడుగుల లోతులో మునిగిపోయిన ఓడ శిథిలాలను పోలిష్ డైవర్ల బృందం కనుగొంది. ఓడలో షాంపైన్, వైన్, మినరల్ వాటర్, పింగాణీ వస్తువులను వారు కనుగొన్నారు. పరిశోధకులు తెలిపిన వివరాల మేరకు.. బాల్టిక్ సముద్రం అడుగున మునిగిపోయిన ఓడ ఓపెన్‌ చేయని సీల్డ్‌ షాంపైన్ సీసాలతో నిండి ఉన్నట్టుగా గుర్తించారు. ఈ నౌక 19వ శతాబ్దానికి చెందినది. ఏళ్ల తరబడి నీళ్లలో మునిగిపోయి ఉన్న ఈ ఓడ ఖరీదైన మద్యం సీసాలతో నిండిపోయి ఉందని పోలిష్ డైవర్ల బృందం తెలిపింది. ఈ ఓడలో 100 కంటే ఎక్కువ షాంపైన్ బాటిళ్లు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. డైవర్లు సముద్రపు అడుగుభాగంలో మునిగిపోయిన ఓడల కోసం కొన్నేళ్లుగా వెతుకుతున్నందున, ఈ ఆవిష్కరణ చాలావరకు యాదృచ్చికమని అన్నారు పరిశోధకులు.

వందల ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన ఓడను కనుగొన్న టీమ్‌ లీడర్‌ టోమాస్ట్‌ స్టాచురా ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ.. నీళ్లలో మునిగిపోయిన ఓడ శిథిలాలలో షాంపైన్‌, మినరల్‌ వాటర్‌, పింగాణి పాత్రలు పెద్ద మొత్తంలో ఉన్నాయని చెప్పారు. స్టాచురా బాల్టిక్ సముద్రంలో ఇప్పటి వరకు వేలాది శిధిలాలను ఫోటో తీశాడు. ఈ క్రమంలోనే స్వీడన్‌లోని ఓలాండ్ ద్వీపానికి 37 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ ఓడను గుర్తించారు. బృందంలోని ఇద్దరు డైవర్లు చిన్న డైవ్ కోసం నీటిలోకి వెళ్లారని, అయితే రెండు గంటల వరకు బయటకు రాలేదని, ఆ తర్వాత నీటి అడుగున ఆసక్తికరమైన విషయం ఉందని వారు గ్రహించారు. అక్కడ ఆసక్తికరమైన అంశం ఏదో ఉందని తమకు ముందుగానే తెలుసునని అతను చెప్పాడు.

శిథిలాలలో లభించిన సీసాలు జర్మన్ కంపెనీ సెల్టర్స్ బ్రాండ్ పేరుతో ఉన్నాయని చెప్పారు. 1850-1867 మధ్య కాలంలో ఓడ మునిగిపోయి ఉండొచ్చని ఓడలో దొరికిన సీసాల ఆధారంగా గుర్తించారు పరిశోధకులు. ఈ బాటిల్స్‌ ప్యాక్‌ చేసిన కంపెనీ నేటికీ ఉందని చెప్పారు. అయితే, ఈ ఓడలో దొరికిన పాత షాంపైన్ తాగవచ్చో లేదో చూడాల్సి ఉందన్నారు. అయినప్పటికీ షాంపైన్ కోసం డైవర్లు ఎంతో ఆశగా ఉన్నారు. మధ్య జర్మనీలోని ఒక ఖనిజ నీటి బుగ్గ నుండి వచ్చిన నీరు కూడా చాలా ముఖ్యమైనదని చెప్పారు. ఈ నీటిని 800 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా రవాణా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..