ఘోరం.. ఆలయం నుంచి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. ఏడుగురు చిన్నారులు సహా 11 మంది మృతి..
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు.. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ కంటైనర్ ను ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మరణించారు.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని అధికారులు తెలిపారు. మృతుల్లో ఏడుగురు పిల్లలున్నారు.

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు.. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ కంటైనర్ ను ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మరణించారు.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని అధికారులు తెలిపారు. మృతుల్లో ఏడుగురు పిల్లలున్నారు. ఈ ఘోర ప్రమాదం రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్యాసింజర్ పికప్ వ్యాన్ ట్రక్కును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలు సహా 11 మంది మరణించారని అధికారులు తెలిపారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.
ఆలయానికి వెళ్లి వస్తుండగా..
బాధితులు ఉత్తరప్రదేశ్‌లోని ఎటా ప్రాంతానికి చెందిన వారు.. వీరంతా ఖాతు శ్యామ్, సాలాసర్ బాలాజీ ఆలయాలను సందర్శించి తిరిగి వస్తుండగా మనోహర్‌పూర్ హైవేపై తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని దౌసా పోలీసు సూపరింటెండెంట్ సాగర్ తెలిపారు. మృతుల్లో ఏడుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారని ఆయన తెలిపారు.
#WATCH | Rajasthan | SP Sagar Rana says, “An information was received about devotees coming from Khatu Shyam temple who met with an accident and till now, 10 casualties have occurred. Nearly 7-8 people have been referred to SMS Hospital in Jaipur…” pic.twitter.com/v747iulPjK
— ANI (@ANI) August 13, 2025
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పికప్ వాహనంలో 20 మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో హైవే సర్వీస్ లేన్‌లో ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టిదని.. పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
అంతకుముందు, దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ, గాయపడిన ముగ్గురు వ్యక్తులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తొమ్మిది మందిని తదుపరి వైద్య సంరక్షణ కోసం సూచించామని చెప్పారు. ప్రమాదంలో 10 మంది మరణించారని ఆయన మొదట నివేదించారు. ఆ తర్వాత ఒకరు మరణించారు.
ఈ ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడిన వారికి తగిన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
“దౌసాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరిగిందనే వార్త చాలా బాధాకరం. గాయపడిన వారికి సత్వర.. సరైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని శర్మ X లో రాశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




