AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirbhaya Case: నిర్భయ ఘటనకు పదేళ్లు.. కఠిన చట్టాలొచ్చినా.. కన్పించని మార్పు..

సరిగ్గా పదేళ్ల క్రితం.. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయిపై ఢిల్లీ నడిబొడ్డున సామాహిక అత్యాచారం జరిగింది. నిర్భయ ఘటనగా పేరొందిన ఈ అత్యాచార ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా..

Nirbhaya Case: నిర్భయ ఘటనకు పదేళ్లు.. కఠిన చట్టాలొచ్చినా.. కన్పించని మార్పు..
Convicteds In Nirbhaya Case (file Photo)
Amarnadh Daneti
|

Updated on: Dec 16, 2022 | 8:09 AM

Share

సరిగ్గా పదేళ్ల క్రితం.. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయిపై ఢిల్లీ నడిబొడ్డున సామాహిక అత్యాచారం జరిగింది. నిర్భయ ఘటనగా పేరొందిన ఈ అత్యాచార ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌ను సైతం కుదిపేసింది. దీంతో ప్రభుత్వం నిర్భయ పేరుతో చట్టం తీసుకొచ్చింది. తర్వాతి కాలంలో నిర్భయ ఘటనలో దోషులకు శిక్ష పడింది. ఎన్ని చట్టాలు తెచ్చినా.. కఠిన శిక్షలు విధించినా మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై దాడులు, అత్యాచారాలు ఎప్పటిలానే కొనసాగుతున్నాయి. నిర్భయ ఘటన జరిగి 10 ఏళ్లయినా ఈ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని నిర్భయ తల్లిదండ్రులు సైతం వాపోతున్నారు. నిర్భయకు తప్ప ఎవరికీ న్యాయం జరిగిందని తాను అనుకోవడం లేదని నిర్భయ తల్లి అన్నారు. దేశంలో ఇప్పటికీ మహిళకు భద్రత లేదని నిర్భయ తండ్రి తెలిపారు. ఇప్పటికీ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారన్నారు. అయితే, లైంగిక వేధింపుల నుంచి బయటపడిన వారు ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారని, ఇదొక్కటే కొత్తగా వచ్చిన మార్పు అన్నారు నిర్భయ తల్లి.

గతేడాది దేశ రాజధాని ఢిల్లీలో సగటున రోజుకు ఇద్దరు మైనర్లు అత్యాచారానికి గురైనట్లు నేషనల్‌ క్రైమ్‌బ్యూరో రికార్డ్స్‌ తెలిపింది. 2021లో ఢిల్లీలో ఉన్న మహిళలపై 13వేలకు పైగా నేరాలు జరిగాయని, 2020తో పోలిస్తే 40 శాతం పెరిగాయని తెలిపింది. నిర్భయ ఘటనకు మరో రెండ్రోజుల్లో 10 ఏళ్లు పూర్తవుతాయనగా.. 17 ఏళ్ల బాలికపై యాసిడ్‌ దాడి జరగడం పరిస్థితికి అద్దం పడుతోంది.

తాజా ఘటనపై నిర్భయ తండ్రి స్పందిస్తూ.. ఆ బాలిక ఏం తప్పు చేసింది? స్కూలుకెళ్లే ఆ చిన్నారి జీవితం ఇప్పుడు నాశనమైపోయింది అంటూ ఆందోళన వ్యక్తంచేశారు. పదేళ్లు పూర్తయినా కూతురు జ్ఞాపకాలు తమను వెంటాడుతూనే ఉన్నాయంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..