మాస్ హిట్ కోసం యంగ్ హీరో ఆరాటం..తానే రచయితగా..!
క్లాస్ హిట్స్ ఎన్ని వచ్చినా ఒక లెక్క. అదే ఒక్క మాస్ హిట్ పడితే ఆ రేంజే వేరు. అందుకే హీరోలందరూ మాస్ బొమ్మ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు.

క్లాస్ హిట్స్ ఎన్ని వచ్చినా ఒక లెక్క. అదే ఒక్క మాస్ హిట్ పడితే ఆ రేంజే వేరు. అందుకే హీరోలందరూ మాస్ బొమ్మ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏ రచయిత అయినా ఓ మాంచి మాస్ కథ తెస్తారేమో అని ఎదురుచూస్తూ ఉంటారు. థియేటర్ కి మళ్లీ మళ్లీ వచ్చి సినిమా చూసేది..చొక్కాలు చించుకునేది.. హారతులు పట్టేది మాస్ ఆడియెన్సే. అందుకే ప్రేమ కథలతో గుర్తింపు తెచ్చుకున్న నాగశార్య అశ్వద్ధామ చిత్రంతో మాస్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. దీంతో నాగశౌర్య కోరిక అలానే ఉండిపోయింది.
అశ్వద్దామకు రచయిత కూడా నాగశౌర్యే అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫలితం తేడా కొట్టినా మరోసారి రచయితగా తన లక్ పరీక్షించుకోవాలని శౌర్య భావిస్తున్నాడట. అందుకోసం ఈ లాక్ డౌన్ లో మంచి మాస్ కథ రాసుకున్నాడట. పనిలో పనిగా కండలు కూడా పెంచేశాడట. అన్నీ కుదిరితే బయటి నిర్మాణ సంస్థతో లేదంటే తన హోమ్ బ్యానర్ లోనే సినిమా చేయాలని డిసైడయినట్టు సమాచారం. మరి ఈ సారైనా ఈ యంగ్ హీరో తన కల నెరవేర్చుకుంటాడో లేదో చూడాలి.