AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: తక్షణమే రాష్ట్రం వదిలి వెళ్లండి.. వారికి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలిచివేసింది. పకృతిని ఆస్వాధించేందుకు వెళ్లిన 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులు అందరూ దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.

Andhra News: తక్షణమే రాష్ట్రం వదిలి వెళ్లండి.. వారికి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు!
Ap
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Apr 27, 2025 | 11:49 AM

Share

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలిచివేసింది. పకృతిని ఆస్వాధించేందుకు వెళ్లిన 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న పాకిస్థానియులు అందరూ దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా తమ ప్రాంతంలో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వాళ్లను రాష్ట్రం నుంచి పంపేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. రాష్ట్రంలోని పాకిస్థాన్‌ జాతీయులు తక్షణమే రాష్ట్రాన్ని విడిచి వెళ్లేలా చర్యలు చేపట్టాలని పోలీసులకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో సమీక్ష నిర్వహించిన డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా రాష్ట్రంలో ఎక్కడ పాకిస్థానీయులు ఉన్నా తక్షణమే వారిని దేశం నుంచి పంపించేయాలని జిల్లాల ఎస్పీలను, పోలీస్‌ కమిషనర్లను ఆదేశించారు.

డీజీపీ ఆదేశాలతో రాష్ట్రంలో 21 మంది పాకిస్థాన్ దేశస్తులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో 15 మంది ఇవాళ సాయంత్రంలోపు దేశం విడిచి వెళ్తామని చెప్పగా, మరో ఏడుగురు వైద్య సేవల నిమిత్తం మెడికల్‌ వీసాలతో వచ్చిన వారు కావడంతో వారికి ఈనెల 29 వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత దేశం విడిచి పాకిస్థాన్‌కు వెళ్లిపోతామని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పాకిస్థానీ పౌరుల వివరాలను సేకరించిన పోలీసులు డిపార్ట్మెంట్ ఆదేశాల ప్రకారం వారిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. వారి ప్రయాణానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లను కూడా ముమ్మరం చేశారు. రాష్ట్రం అంతటా ఉన్న పాకిస్థానీ పౌరులపై ప్రత్యేక నిఘా పెంచి, ఎలాంటి అనూహ్య ఘటనలు జరగకుండా చూస్తున్నారు. అలాగే కొత్తగా రాష్ట్రానికి ఎవరు వస్తున్నా, వారి వీసా వివరాలను పరిశీలించి, అనుమతులు జారీ చేసే విధానాన్ని కఠినతరం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు భద్రతా పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాక, విదేశీ పౌరులపై ముఖ్యంగా పాక్ పౌరులపై ప్రభుత్వ నిఘా కొనసాగుతుందని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…