NRI News: విదేశాల్లోని భారతీయులు మ్యూచువల్ ఫండ్లలో ఇలా సింపుల్ గా ఇన్వెస్ట్ చేయవచ్చు.. పూర్తి వివరాలు చూడండి..

NRIs Investments: ఈ రోజుల్లో ఉద్యోగ రీత్యా ఎక్కువమంది భారతీయులు విదేశాలకు వెళ్లడం సర్వసాధారణం. వారిలో చాలా మంది కొన్ని సంవత్సారాల తరువాత తిరిగి స్వదేశానికి రావాలని భావిస్తూ ఉంటారు.

NRI News: విదేశాల్లోని భారతీయులు మ్యూచువల్ ఫండ్లలో ఇలా సింపుల్ గా ఇన్వెస్ట్ చేయవచ్చు.. పూర్తి వివరాలు చూడండి..
Nri's Investment In Mutual Funds
Follow us

|

Updated on: Feb 07, 2022 | 5:51 PM

NRIs INVESTMENTS IN MUTUAL FUNDS: ఈ రోజుల్లో ఉద్యోగ రీత్యా ఎక్కువమంది భారతీయులు విదేశాలకు వెళ్లడం సర్వసాధారణం. వారిలో చాలా మంది కొన్ని సంవత్సారాల తరువాత తిరిగి స్వదేశానికి రావాలని భావిస్తూ ఉంటారు. అలాంటి వారు స్వదేశంలోని మ్యూచువల్ ఫండ్లలో(MUTUAL FUND INVESTMENTS) తమ సంపాదనను ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇంతకీ వారికి ఆ అవాకాశం ఉందా లేదా తెలుసుకోండి.. దానికి చట్టం పరంగా ఉండే నియమనిబంధనలను ఇక్కడ తెలుసుకోండి. ఆపై సులువుగా డబ్బును ఇన్వెస్ట్ చేసుకోండి.. దీనిలో ముఖ్యంగా ఫెమా(ఫారెన్ ఎక్ఛేంజ్ రెగులేషన్ చట్టం)కు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలి. ఇన్వెస్ట్ మెంట్ల విషయంలో యూఎస్ఏ, కెనడా దేశాల్లో నివసించే భారతీయులకు మాత్రం కొన్ని ఆంక్షలు ఉన్నాయి. కానీ.. US, CANADA లోని భారతీయుల పెట్టుబడులను సుందరం, ఎల్ అండ్ టి, రిలయన్స్, యుటిఐ తో పాటు మరికొన్ని ఏఎమ్ సి(ఎసట్ మ్యానేజ్ మెంట్ కంపెనీలు) స్వీకరిస్తున్నాయి. అది కూడా ఎటువంటి చిక్కులూ లేకుండా ఆన్ లైన్ విధానంలో సేవలు అందిస్తున్నాయి. ఈ ప్రక్రియలోనే యూనిట్ల కొనుగోళ్లు, అమ్మకాలు, స్కీముల మార్పు, స్కీముల నుంచి డబ్బు ఉపసంహరణ.. ఇలా అన్నీ ఆన్ లైన్ లోనే చేసుకునేందుకు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సౌకర్యవంతంగా సేవలను అందిస్తున్నాయి. పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్లకు నేరుగా అందిస్తున్నాయి.

పెట్టుబడికి అసలు ఏం కావాలి..

భారత చట్టాల ప్రకారం విదేశాల్లోని వారు నేరుగా అక్కడి (విదేశీ) కరెన్సీలను నేరుగా పెట్టుబడులు పెట్టడానికి వినియోగించడం కుదరదు. దీనికోసం వారు ప్రత్యేకంగా.. భారత్ లోని ఏదైనా బ్యాంకు ద్వారా ఎన్ఆర్ఓ(NRO), ఎన్ఆర్ఈ(NRE), ఎఫ్ సిఎన్ఆర్(FCNR) ఎకౌంట్ పొందాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పాన్, పాస్ పోర్టు, నివాస వివరాలతో కూడిన కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం బ్యాంకు పెట్టుబడిదారుడు ప్రత్యక్షంగా వెరిఫికేషన్ పూర్తి చేసుకునేందుకు రావాలని సూచిస్తే అక్కడి భారత ఎంబసీ సహకారం పొందవచ్చు.

ఆదాయంపై ట్యాక్స్ ఎలా ఉంటుందంటే..

విదేశాల్లో నివసించే వారి ఇన్వెస్ట్ మెంట్లకు ఎక్కువ ట్యాక్స్ విధిస్తారన్న అవాస్తవం. వారికి రెండింతలు ట్యాక్స్ విధిస్తారనేది ఆ దేశంతో భారత ప్రభుత్వానికి ఉన్న అగ్రిమెంట్లపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈక్విటీ ఇన్వెస్ట్ మెంట్లపై 15 శాతం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, 10 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధిస్తారు. ఎక్కువ కాలం పాటు తమ ఇన్వెస్ట్ మెంట్లను కొనసాగించే వారికి మాత్రం వీటి ద్వారా మంచి లాభాలు వస్తాయి. విదేశీ మారక విలువల ఆధారంగా వచ్చే మార్పులతో కొన్ని సార్లు వారికి సాధారణంగా రావలసిన దానికన్నా మంచి లాభాలు కూడా వస్తుంటాయి.

(Note: పెట్టుబడులపై నిర్ణయం తీసుకునే ముందు మీ ఫైనాన్స్ సలహాదారుని పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం ఉత్తమం.)

ఇవీ చదవండి..

AIR INDIA: ఎయిర్ ఇండియాకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.. పేరు వెనుక ఉన్న కథను మీరూ తెలుసుకోండి.. 

NMDC Recruitment 2022: ఎమ్మెస్సీ/ఎంటెక్‌ అర్హతతో నెలకు రూ.1,30,000లు సంపాదించే అవకాశం.. పూర్తి వివరాలు తెలుసుకోండి!