AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tanmay Bhat: తన్మయ్‌ భట్‌ 50 కిలోలు ఎలా తగ్గాడు? ఆ సీక్రెట్ ఏంటో ఆయన మాటల్లోనే..

అయితే ఇలా ఉన్నపలంగా బరువు తగ్గితే కచ్చితంగాం అదేదో సర్జరీ చేయించుకున్నారని చాలా మంది భావిస్తారు. కానీ భట్‌ చాలా సహజంగానే బరువు తగ్గాడు. ఇంతకీ తన్మయ్‌ భట్‌ బరువు ఎలా తగ్గాడు.? ఇందుకోసం ఆయన పాటించిన నియమాలు ఏంటి.? లాంటి అంశాలను ఇటీవల ఇచ్చిన ఓ పాడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను బరువు తగ్గడానికి ఐదు చిట్కాలను పాటించానని...

Tanmay Bhat: తన్మయ్‌ భట్‌ 50 కిలోలు ఎలా తగ్గాడు? ఆ సీక్రెట్ ఏంటో ఆయన మాటల్లోనే..
Tanmay Bhat
Narender Vaitla
|

Updated on: Sep 20, 2024 | 8:32 AM

Share

తన్మయ్‌ భట్‌.. ఈ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. హాస్యనటుడిగా, యూట్యూబర్‌గా భట్‌కు మంచి పేరు ఉంది. తనదైన కామెడీతో సోషల్‌ మీడియాలో చాలా మంది ఫాలో వర్స్‌ని సంపాదించుకున్నాడు భట్‌. అయితే ఒకప్పుడు భారీకాయంతో ఉన్న భట్ ప్రస్తుతం సన్నబడ్డాడు. ఎంతలా అంటే ఏకంగా 50 కిలోల బరువు తగ్గేంతలా.?

అయితే ఇలా ఉన్నపలంగా బరువు తగ్గితే కచ్చితంగాం అదేదో సర్జరీ చేయించుకున్నారని చాలా మంది భావిస్తారు. కానీ భట్‌ చాలా సహజంగానే బరువు తగ్గాడు. ఇంతకీ తన్మయ్‌ భట్‌ బరువు ఎలా తగ్గాడు.? ఇందుకోసం ఆయన పాటించిన నియమాలు ఏంటి.? లాంటి అంశాలను ఇటీవల ఇచ్చిన ఓ పాడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను బరువు తగ్గడానికి ఐదు చిట్కాలను పాటించానని చెప్పుకొచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* తాను బరువు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఒకటని తెలిపారు. కచ్చితంగా ప్రతీ రోజూ రెండు గంటలు జిమ్‌కి వెళ్లానని, బ్యాడ్మింటన్‌ ఆడుతానని తెలిపారు.

* జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకున్నానని తెలిపారు భట్‌. ఉదయాన్నే నిద్రలేవడం, జిమ్‌కి వెళ్లడం, బరువులు ఎత్తడం, ఆరోగ్యకరమైన ఫుడ్ తినడంతో పాటు స్టాకింగ్‌ను అలవాటు చేసుకున్నారు. అటామిక్‌ హ్యాబిట్స్‌ పుస్తకంలో పేర్కొన్న స్టాకింగ్ అలవాటును తన జీవనశైలిలో అలవాటు చేసుకున్నానని చెప్పుకొచ్చారు. ప్రతీరోజూ కచ్చితంగా బ్యాడ్మింటన్‌ ఆడేవాడినని తెలిపారు.

* ఇక కొన్ని రకాల అలవాట్లను పూర్తిగా మానేయాలని భట్‌ తెలిపారు. స్నేహితులు బలవంతం చేస్తున్నారని, మరో కారణాన్ని నెపంగా చూపుతూ స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు మంచిది కాదని ఆయన అన్నారు. పరిస్థితులను నిందించడం సరికాదని చెప్పుకొచ్చారు

* మానసిక స్థితిని కూడా మెరుగుపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనసు నిలకడగా ఉండదు. జిమ్‌కి వెళ్లొద్దు కాసేపు పడుకోఅని చెబుతుంది. స్వీట్స్‌ను తినమని చెబుతుంది, జంక్‌ ఫుడ్‌ తీసుకోమని అంటుంది. అయితే మనసును కంట్రోల్‌ చేసుకోవడానికి యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి.

* ఒత్తిడిని కూడా కంట్రోల్ చేసుకోవాలని భట్‌ తెలిపారు. ఒత్తిడి ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి ఒత్తిడి ఒక కారణమని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవాటు చేసుకోవాలని, మంచి ఆహారాన్ని తీసుకోవాలని. మొత్తంమీద ఒత్తిడిని దూరం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని భట్ సూచించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..