ఒక్క సెల్పీతో బీపీ చెకప్..?
మీరు రక్తపోటుతో బాధపడుతున్నారా..? బీపీ చెకప్ కోసం నెల నెల ఆస్పత్రి వరకూ వెళ్లి మీ బీపీ హెచ్చుతగ్గులు తెలుసుకుంటున్నారా..? అయితే, మీకు ఓ గుడ్ న్యూస్. ఇప్పుడు మీ బీపీని చెక్ చేసుకోవడానికి సులువైన మార్గం దొరికింది. మీ చేతిలో మొబైల్ ఫోన్లో సెల్ఫీ తీసుకున్నంత ఈజీగా బీపీని చెక్ చేసుకునే అవకాశం వచ్చింది. టొరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్త కాంగ్ లీ సరికొత్తగా వీడియో సెల్ఫీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఇందులో చర్మం లోపలి చిత్రాలు […]
మీరు రక్తపోటుతో బాధపడుతున్నారా..? బీపీ చెకప్ కోసం నెల నెల ఆస్పత్రి వరకూ వెళ్లి మీ బీపీ హెచ్చుతగ్గులు తెలుసుకుంటున్నారా..? అయితే, మీకు ఓ గుడ్ న్యూస్. ఇప్పుడు మీ బీపీని చెక్ చేసుకోవడానికి సులువైన మార్గం దొరికింది. మీ చేతిలో మొబైల్ ఫోన్లో సెల్ఫీ తీసుకున్నంత ఈజీగా బీపీని చెక్ చేసుకునే అవకాశం వచ్చింది. టొరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్త కాంగ్ లీ సరికొత్తగా వీడియో సెల్ఫీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు.
ఇందులో చర్మం లోపలి చిత్రాలు తీయగల సాఫ్ట్ వేర్ తో తాము ముందుగా కొంతమంది ముఖాల వీడియోలు తీశామని..రెండు నిమిషాల ఈ వీడియోల ద్వారా సేకరించిన బీపీ వివరాలకు బీపీ మెషిన్ ద్వారా సేకరించిన వివరాలను సరిపోల్చి ఈ సాఫ్ట్ వేర ను సిద్ధం చేశామని తెలిపారు. మెషిన్ లెర్నింగ్ పద్దతులను వాడటం ద్వారా ఈ సాఫ్ట్ వేర్ మన ముఖంలోని రక్తప్రసరణలో వచ్చే మార్పులను గుర్తించి దాని ఆధారంగా బీపీని లెక్కకట్టగలదు. ఈ పద్ధతి ద్వారా వచ్చే వివరాలు 95 శాతం ఖచితత్వంతో ఉన్నట్లు తమ అధ్యయనాల్లో తెలిసిందని కాంగ్ లీ వెల్లడించారు. మరికొన్ని పరిశోధనలు జరిపి త్వరలో అర నిమిషం వీడియో సెల్ఫీతో బీపీ చెక్ చేసే సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తామని కాంగ్ లీ స్పష్టం చేశారు.