AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: 6 నెలల్లో 27 కిలోల బరువు మాయం: ఆమె ఏం చేసిందో తెలిస్తే షాకే..

బరువు తగ్గే మార్గం స్ఫూర్తినిచ్చేదిగా, కష్టంతో కూడుకున్నదిగా ఉంటుంది. దీనికి క్రమశిక్షణ, సహనం, సరళమైన అలవాట్ల కలయిక అవసరం. సిమర్ అనే యువతి ఆరు నెలల కాలంలో ఏకంగా 27 కిలోల బరువు తగ్గి అసాధారణ మార్పు సాధించి, సోషల్ మీడియాలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. బ్యాలెన్స్ ముఖ్యం తప్ప, కఠిన నియమాలు కాదంటూ ఆమె తన విజయ రహస్యాలు పంచుకున్నారు. రోజుకు పదివేల అడుగులు నడవాలనే నిబంధన పాటించకున్నా, ఆమె కేవలం కొన్ని స్థిరమైన, ఆరోగ్యకరమైన అలవాట్లతో ఈ అద్భుత పరివర్తన ఎలా సాధించిందో వివరంగా తెలుసుకుందాం.

Weight Loss: 6 నెలల్లో 27 కిలోల బరువు మాయం: ఆమె ఏం చేసిందో తెలిస్తే షాకే..
Sustainable Weight Loss
Bhavani
|

Updated on: Oct 30, 2025 | 10:13 PM

Share

బరువు తగ్గేందుకు అనుసరించే పంథా ప్రేరణ కలిగిస్తూనే కఠినంగా ఉంటుంది. దీనికి క్రమశిక్షణ, సహనం, స్థిరమైన అలవాట్ల కలయిక అవసరం. సిమర్ ఆరు నెలల కాలంలో 27 కిలోల బరువు తగ్గి అద్భుతమైన మార్పు సాధించారు. అతి కఠిన నియమాల కన్నా సమతుల్యతే ముఖ్యమని ఆమె తన పోస్టుల ద్వారా తెలిపారు. రోజుకు పదివేల అడుగులు నడవాలనే నిబంధన పాటించకున్నా, కేవలం కొన్ని ఆరోగ్యకర అలవాట్లతో ఈ అద్భుత పరివర్తన ఎలా సాధ్యమైందో వివరించారు.

ఆ నాలుగు కీలక అలవాట్లు

సమగ్ర ఆహారం తీసుకోవటం వలన పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. ఎక్కువసేపు ఆకలిని నియంత్రించవచ్చు. ఈ విషయంలో సిమర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. దేహం సరిగా కోలుకోవటానికి, అనవసరమైన ఆహార కోరికలు రాకుండా ఉండటానికి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని ఆమె నమ్మేవారు. ప్రతి భోజనం అయ్యాక పది నిమిషాలపాటు నడవటం జీర్ణక్రియకు సహాయపడుతుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది.

ప్రణాళికతో కూడిన విందు

సిమర్ శుద్ధ ఆహారం తీసుకున్నప్పటికీ, ఇష్టమైన వాటిని పూర్తిగా మానుకోలేదు. క్యాలరీలు, మాక్రోన్యూట్రియెంట్ల లక్ష్యాల పరిధిలో తెలివిగా ప్లాన్ చేసుకొని ఆరగించారు. పరిపూర్ణత కన్నా నిలకడకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచిస్తారు.

ఆమె దైనందిన ఆహారం

ఆమె బరువు తగ్గటంలో దోహదపడిన దైనందిన ఆహార అలవాట్లు ఇవి. ప్రధాన ప్రొటీన్ వనరులుగా కోడి మాంసం, గుడ్లు, టోఫుపై ఆధారపడ్డారు. కార్బోహైడ్రేట్ల కోసం శుద్ధి చేసిన పిండి లేని తృణధాన్యాల రొట్టె, సాధారణ ఉడికించిన బియ్యం వంటి ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలు తీసుకున్నారు. ఆరోగ్యకర కొవ్వుల కోసం అవకాడో, తాజా పండ్లు ఆహారంలో చేర్చుకున్నారు. స్నాక్స్‌లో మఖానా, పాప్‌కార్న్, గ్రీక్ యోగర్ట్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. బయట తక్కువ క్యాలరీల పానీయాలు తాగేవారు.

View this post on Instagram

A post shared by Simar 🍜 (@_lifeofsimar)

మరికొన్ని విజయ సూత్రాలు

ఆమె అధిక ప్రొటీన్, తక్కువ కార్బొహైడ్రేట్ ఆహారం పాటించారు. కృత్రిమ చక్కెరలు పూర్తిగా మానేశారు. వారం‌లో మూడు లేదా నాలుగు సార్లు కోర్ వర్కవుట్స్ చేశారు. రోజుకు 8,000 అడుగుల కన్నా ఎక్కువ నడిచేలా చూసుకున్నారు. ఎలాంటి కఠినమైన, తాత్కాలిక ఆహార నియమాలు కన్నా… స్థిరంగా పాటించగలిగే ఆహారం, వ్యాయామ దినచర్యను అలవర్చుకోమని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు