AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ క్యారెట్ తింటే చాలు.. క్యాన్సర్‌‌ని మీ దరిదాపులకు కూడా రాకుండా అరికట్టవచ్చు..

బరువు పెరగడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో క్యారెట్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అలాగే శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు క్యారెట్ల నుంచి లభిస్తాయి. అయితే మనం తినే క్యారెట్లు ఆరెంజ్ రంగులో ఉంటాయి. కానీ క్యారెట్లు నలుపు..

Health Tips: ఈ క్యారెట్ తింటే చాలు.. క్యాన్సర్‌‌ని మీ దరిదాపులకు కూడా రాకుండా అరికట్టవచ్చు..
Black Carrots
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 08, 2023 | 7:05 AM

Share

క్యారెట్‌తో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడంలో అలాగే బరువు పెరగడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో క్యారెట్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అలాగే శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు క్యారెట్ల నుంచి లభిస్తాయి. అయితే మనం తినే క్యారెట్లు ఆరెంజ్ రంగులో ఉంటాయి. కానీ క్యారెట్లు నలుపు రంగులో కూడా ఉంటాయని మీకు తెలుసా..? నిజంగానే నల్లగా కూడా ఉంటాయి. ఆరెంజ్ క్యారెట్ల కంటే ఎక్కువ మొత్తంలో పోషకాలు, ప్రయోజనాలును కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇవి బరువు తగ్గడంలో, క్యాన్సర్‌ని నిరోధించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంకా నల్ల క్యారెట్లతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం..

నల్ల క్యారెట్లను తినడం వల్ల  కలిగే ప్రయోజనాలు

  • న‌ల్ల క్యారెట్లలో ఉండే ఆంథోసైనిన్‌ అనే ప‌దార్థం.. మ‌న శ‌రీరానికి క్యాన్సర్‌ కణాలతో పోరాడేందుకు కావాల్సిన శక్తిని ఇస్తుంది.
  • ఆరెంజ్‌ క్యారెట్లలో ఉన్నట్టే న‌ల్ల రంగు క్యారెట్‌ల‌లో కూడా ఉండే బీటా కెరాటిన్‌.. మన కంటి చూపును మెరుగుపరిచి, కంటి కణాలకు రక్షణ క‌ల్పిస్తుంది.
  • న‌ల్ల క్యారెట్‌ల‌లో ఉండే పీచు పదార్థం ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవ్వడమేగాక శరీరంలోని కొవ్వు‌ తగ్గుతుంది.
  • వ‌య‌సు మ‌ళ్లిన వారిని వేధించే ఆర్థరైటిస్ స‌మ‌స్యను కారెట్లలోని యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు సరిష్కరిస్తాయి.
  • మతిమరుపు స‌మ‌స్య ఉన్నవారు న‌ల్ల క్యారెట్‌లు తినడం మంచిది. వీటిిని తినడం వల్ల మతిమరుపు సమస్య తొలగిపోవడమే కాక అల్జీమర్స్‌ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి.
  • విటమిన్ సీ ఉన్న కారణంగా ఇది తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడంతో పాటు, రోగ నిరోధక శక్తి ని మెరుగుపరుస్తుంది.
  • నల్ల క్యారెట్ మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం, గుండెల్లో మంట, అలసట, విరేచనాలు వంటి వ్యాధులను నయం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం. ఇక్కడ క్లిక్  చేయండి..

Follow Us
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు