Itch in Feet: పాదాలు, చేతి వేళ్ల మధ్యలో దురద పెడుతోందా.. వీటితో చెక్ పెట్టొచ్చు!

వర్షా కాలం వచ్చిందంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తూ ఉంటాయి. వాతావరణంలో పరిస్థితి మారినప్పుడు వచ్చే సమస్యలు జలుబు, జ్వరం, దగ్గు వంటివి కామన్. ఇవి కాకుండా పలు సమస్యలో ఇబ్బంది పడుతూ ఉంటాం. చర్మ సమస్యలు, ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ అనేవి కేవలం ఎండా కాలంలో మాత్రమే కాదు.. వర్షా కాలంలో కూడా వస్తూ ఉంటాయి. వర్షా కాలంలో వచ్చే సమస్యల్లో కాళ్లు, చేతి వేళ్ల మధ్యలో ఎక్కువగా దురదగా అనిపిస్తుంది. చాలా మంది అలానే గోకుతూ ఉంటారు. నిజానికి అది కాళ్లు ఎక్కువగా నీటిలో ఉంచడం వల్ల నాని..

Itch in Feet: పాదాలు, చేతి వేళ్ల మధ్యలో దురద పెడుతోందా.. వీటితో చెక్ పెట్టొచ్చు!
Itch In Feet
Follow us

|

Updated on: Jul 04, 2024 | 4:26 PM

వర్షా కాలం వచ్చిందంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తూ ఉంటాయి. వాతావరణంలో పరిస్థితి మారినప్పుడు వచ్చే సమస్యలు జలుబు, జ్వరం, దగ్గు వంటివి కామన్. ఇవి కాకుండా పలు సమస్యలో ఇబ్బంది పడుతూ ఉంటాం. చర్మ సమస్యలు, ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ అనేవి కేవలం ఎండా కాలంలో మాత్రమే కాదు.. వర్షా కాలంలో కూడా వస్తూ ఉంటాయి. వర్షా కాలంలో వచ్చే సమస్యల్లో కాళ్లు, చేతి వేళ్ల మధ్యలో ఎక్కువగా దురదగా అనిపిస్తుంది. చాలా మంది అలానే గోకుతూ ఉంటారు. నిజానికి అది కాళ్లు ఎక్కువగా నీటిలో ఉంచడం వల్ల నాని.. ఇన్ ఫెక్షన్స్ వంటివి సోకుతాయి. దీంతో అక్కడ బాగా దురదగా అనిపిస్తుంది. ఈ సమస్యలను కొన్ని రకాల చిట్కాలతో త్వరగా పరిష్కరించుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

పసుపు:

మీకు వేళ్ల మధ్యలో దురదగా, చికాకుగా ఉంటే ఫంగల్ ఇన్ ఫెక్షన్ అయినట్టు. తడి వాతావరణంలో ఎక్కువగా ఉన్నప్పుడు.. కొన్ని రకాల సూక్ష్మ క్రిములు ఎటాక్ చేస్తూ ఉంటాయి. వాటి వలన దురదగా అనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించడంలో పసుపు చక్కగా పని చేస్తుంది.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడాతో వేళ్ల మధ్య వచ్చే దురద తగ్గించుకోవచ్చు. బేకింగ్ సోడా అనేది ఒక క్రిమి నాశిని. దురదగా అనిపించినప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా పెట్టండి. ఇలా చేయడం వల్ల దురద తగ్గడమే కాకుండా.. మరో చోటికి వ్యాపించకుండా చేస్తుంది. గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి అందులో కాళ్లను కూడా ఉంచవచ్చు.

ఇవి కూడా చదవండి

వేప ఆకులు:

వేప ఆకులతో కూడా దురద, ఇన్ ఫెక్షన్ వంటివి తగ్గించు కోవచ్చు. వీటిల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి.. మంచి ఉపశమనం లభిస్తుంది. ముందుగా వేప ఆకులను నీటిలో మరిగించి.. చల్లారిన తర్వాత దురద లేదా చర్మం ఇన్ ఫెక్షన్ ఉన్న చోట రాయాలి. రెండు రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెతో కూడా కాళ్ల మధ్యలో వచ్చే ఇన్ ఫెక్షన్ తగ్గించుకోవచ్చు. కొబ్బరి నూనె ప్రతీ ఇంట్లోనూ ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో ప్రయోజనం చేకూర్చతాయి. అంతే కాకుండా దురద సమస్యను కూడా తగ్గిస్తుంది. కొబ్బరి నూనె వేడి చేసుకుని గోరు వెచ్చగా ఉన్నప్పుడు రాయాలి. ఇందులో పసుపు కూడా కలిపి రాసుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.