ఆరోగ్యంగా ఉండడానికి భోజనం ఎలా చేయాలి? ఎప్పుడు ఏ పదార్ధాలు తినాలో చెప్పిన బాబా రామ్ దేవ్
ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆరోగ్యంగా ఉండటానికి, వివిధ సమస్యల నుంచి బయటపడటానికి తన సోషల్ మీడియాలో అనేక వంటింటి నివారణల చిట్కాలను క్రమం తప్పకుండా పంచుకుంటారు. ఇటీవల ఒక వీడియోలో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే ఆహారం తినడానికి సరైన మార్గం ఏమిటి అనేది ఆయన వివరించారు.

ఎప్పుడైనా సరే తినే ఆహారం విషయంలో నియమాలు పాటించాలి. నిర్ణీత సమయంలో తినడం మంచిది. ఇది మన శరీరానికి శక్తిని అందించడమే కాదు.. మన శారీరక , మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం చాలా అవసరం. అయితే సరైన మార్గంలో తినడం కూడా చాలా ముఖ్యం. సరైన ఆహార పదార్థాల కలయిక జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేయడానికి, శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించడానికి సహాయపడుతుంది. అయితే మనం రుచి కరమైన ఆహారం అంటూ ఇష్టం వచ్చిన సమయంలో తినడం, తప్పుడు ఆహారపదార్ధాల కలయికలో ఆహారాన్ని తనడం కూడా మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఇది గ్యాస్, మలబద్ధకం, ఆమ్లత్వానికి దారితీస్తుంది.
యోగా గురువు .. పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ఎలా తినాలో వివరిస్తూ యూట్యూబ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఒక వ్యక్తి ఋతుభూకుడు, హితభూకుడు.. మిత్భూకుడుగా ఉండాలని ఆయన వివరించారు. ఆయుర్వేదం వివిధ రుతువులకు వివిధ రకాల ఆహారాన్ని సూచిస్తుంది. ఎవరైనా సరే తమ శరీర స్వభావాన్ని బట్టి తినాలి. అది వాత, పిత్త లేదా కఫ అయినా.. సమతుల్య , తేలికపాటి భోజనం తినాలి.
పాలు ,పెరుగు ఎప్పుడు తినాలి?
తిన్న గంట తర్వాత నీరు తాగాలని ఆయన వీడియోలో చెప్పారు. ఉదయం పెరుగు, మధ్యాహ్నం మజ్జిగ, రాత్రి భోజనం తర్వాత గంట తర్వాత పాలు తాగాలి. తిన్న వెంటనే కాదు. పాలు తాగుతూ ఉప్పు కలిపిన ఎటువంటి ఆహరాన్ని తినవద్దు. దీని వలన చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. రాత్రి సమయంలో పెరుగు, మజ్జిగ కూడా తినవద్దు. చాలా మంది పెరుగు తిన్న తర్వాత రాత్రి ఖీర్ తింటారు, కానీ ఇది సరైనది కాదు. పుల్లని పండ్లను కూడా పాలతో తినకూడదు. విరుద్ధ ఆహారం.. అంటే, తప్పుగా ఆహారం కలిపి తింటే చర్మ సంబంధిత సమస్యలు, రోగనిరోధక శక్తి బలహీనపడటం , వాత, పిత్త వంటి దోషాలు పెరుగుతాయి.
సీతాఫలం లేదా పుచ్చకాయను పాలతో కలిపి తినకూడదు. ఇంకా వీటిని తిన్న వెంటనే నీరు త్రాగవద్దు. ఇది శరీరంలో ప్రతిచర్యకు కారణమవుతుంది. కనుక ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ చిన్న విషయాలను జాగ్రత్తగా పరిగణించాలి. ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైన అనేక ఆహార కలయికలు ఉన్నాయి.
ఎప్పుడు ఏమి తినాలి? అయితే ఇప్పుడు అందరికీ ముందుగా ఏమి తినాలో తెలియక అయోమయంగా ఉన్నారు. పచ్చి , వండిన ఆహారాన్ని కలిపి తినకూడదని అంటారు. అయితే ఇందులో పెద్ద సమస్య లేదు. మన ఆహారంలో ఎక్కువ భాగం పచ్చిగా ..మొలకెత్తినవిగా ఉండాలి. మొలకెత్తిన ఆహారాన్ని తినే వారి శరీరంలో విషపదార్థాలు ఉండవు. కనుక ప్రతి రోజూ ఉదయం మొలకెత్తిన ఆహారాన్ని తింటే మంచిది. ఖచ్చితంగా వారానికి ఒకసారి మొలకెత్తిన ఆహారాన్ని తినాలి. అంతేకాదు రోజులో మొదట సలాడ్ , పండ్లు తినాలి, తరువాత ఆహారం తినాలి , చివరికి మీరు ఖీర్ లేదా హల్వా వంటి తీపిని తినవచ్చు. మొదట తేలికైన ఆహారాన్ని తినాలి, మధ్యలో మధ్యస్థమైన ఆహారాన్ని.. చివరిలో బరువైన ఆహారాన్ని తినాలి.
ఆకుకూరలు, ఉసిరికాయలను ఉడికించి తినకూడదు, ఎందుకంటే మరిగించడం వల్ల విటమిన్ సి, అనేక ఇతర పోషకాలు నాశనమవుతాయి. అందువల్ల సలాడ్లు , మొలకలు ఉడకబెట్టకుండా తినాలి. ఉడికించిన ఆహారాన్ని తక్కువగా తినండి . ముడి ఆహారం, పండ్లు , రసాలను ఎక్కువగా తినండి. ఎందుకంటే వీటిని సాత్విక ఆహారాలుగా పరిగణిస్తారు. కనుక వీటిని తీసుకోవాలి.
సలాడ్ ఎలా తినాలి? సలాడ్లు, కీర దోసకాయలు, టమోటాలు సహా అనేక ఇతర రకాల కూరగాయలను సలాడ్లను తరచుగా డ్రెస్సింగ్‌లతో తింటారు, తరచుగా ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు. మన దేశంలో, ఆవ నూనె ఈ ప్రయోజనం కోసం అనువైనది. ఇది సలాడ్లలో ఉపయోగించే కీర దోసకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు, ఇతర కూరగాయల పోషక విలువలను పెంచుతుంది. ఇంకా, సలాడ్ నూనె మాత్రమే జీర్ణం కావడం కష్టం. అయితే ఆలివ్ నూనెను ఆవ నూనెతో లేదా గ్రీన్ చట్నీతో భర్తీ చేయవచ్చు. ఆవ నూనెతో చేసిన చట్నీ చాలా రుచికరంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








