Yoga for Stress: ఒత్తిడిని క్షణాల్లో దూరం చేసే యోగాసనాలు.. ఖచ్చితంగా వేయాల్సిందే!

|

Nov 29, 2024 | 11:55 AM

ప్రస్తుత కాలంలో ఒత్తిడి అనేది సర్వ సాధారణమైన సమస్యగా మారింది. అనేక రకాల టెన్షన్స్, ఇబ్బందుల కారణంగా స్ట్రెస్‌ని తీసుకుంటున్నారు. ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..

Yoga for Stress: ఒత్తిడిని క్షణాల్లో దూరం చేసే యోగాసనాలు.. ఖచ్చితంగా వేయాల్సిందే!
Yoga For Stress
Follow us on

ఈ మధ్య కాలంలో స్ట్రెస్ అనేది బాగా ఎక్కువై పోయింది. ఉద్యోగంలో ఇబ్బందులు, ఇంట్లోని ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒత్తిడి, ఆందోళన అనేవి ఎక్కువై పోయాయి. ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్ట్రెస్‌ వల్ల చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్లి ప్రాణాలను కూడా తీసుకున్నారు. కాబట్టి ఒత్తిడిని ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి యోగా. యోగాతో ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా తగ్గించుకోవచ్చు. ఎలాంటి సమస్యల నుంచి అయినా బయట పడొచ్చు. మరి యోగాసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శవాసనం:

శవాసనంతో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కంట్రోల్ చేయవచ్చు. శవాసనం వేయడం వల్ల శరీరానికి మంచి విశ్రాంతి లభిస్తుంది. శవాసనం వేయడం చాలా సింపుల్. యోగాసనాల్లో శవాసనం మాత్రమే చాలా ఈజీగా వేసే ఆసనం. దీని వల్ల శరీరంలోని ప్రతీ భాగానికి విశ్రాంతి లభిస్తుంది. ఇలా స్ట్రెస్‌ని తగ్గించుకోవచ్చు.

త్రికోణాసనం:

త్రికోణాసనం వేయడం వల్ల కూడా స్ట్రెస్, డిప్రెషన్ నుంచి బయట పడొచ్చు. ఈ ఆసనంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం స్ట్రెస్ రిలీఫ్‌ మాత్రమే కాకుండా వెన్ను నొప్పి సమస్యలు ఉన్నా తగ్గుతాయి. అలాగే శరీరంలో ఉండే చెడు కొవ్వును కూడా ఈజీగా కరిగిస్తుంది. పొట్టలో, తొడల్లో పేరుకు పోయిన కొవ్వు బాగా కరుగుతుంది.

ఇవి కూడా చదవండి

వృక్షాసనం:

వృక్షాసనం కూడా చాలా ఈజీగా వేయవచ్చు. ఎలాంటి వారైనా ఈజీగా ఈ ఆసనం వేయగలరు. ఈ ఆసనం వేయడం వల్ల కూడా స్ట్రెస్ నుంచి బయట పడొచ్చు. ఒత్తిడితో బాధ పడేవారు ఈ ఆసనాలను తరచూ వేస్తే మంచి రిలీఫ్ దొరుకుతుంది. యోగా ఆసనాలు వేయాలంటే.. నిపుణులు పర్యావేక్షణ చాలా అవసరం. ఇంటి వద్ద ఎలా పడితే అలా వేయకూడదు. దీని వల్ల కూడా అనేక దుష్పరిణామాలు వస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..