కోటీశ్వరురాలైనా .. చర్మం మెరుపుకి వంటింటి చిట్కాలే
ఇషా అంబానీ..ఇటీవల తన సోదరుడి పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. చంద్రబింబంలా మెరిసిపోతున్న ముఖంతో అందరి దృష్టిని ఆకర్షించారు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఆమె అందంపైనే చర్చించుకుంటోంది. అంత అందమైన చర్మం కోసం వారు ఏం చేస్తారనే దానిపై ఇంటర్‌నెట్‌లో చాలా మంది సెర్చ్ చేస్తున్నారు.
ఇషా అంబానీ తన అందం కోసం ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ వినియోగిస్తారోనని చాలా మంది ఆరా తీస్తారు. కానీ, కొంతమంది అమ్మాయిల మాదిరిగా ఇషా మేకప్ వేసుకోరట. లక్షలు ఖర్చు చేసే బ్యూటీప్రొడక్ట్స్ కూడా వినియోగించరట.. చర్మ సంరక్షణ కోసం ఇంటి చిట్కాలను పాటిస్తారట..! ఇంతకీ ఇషా అందాల రహస్యం ఏంటో చూద్దాం రండి. ఇషా అంబానీ.. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల కూతురు. కుటుంబ వ్యవహారాలను కూడా ఇషా చూసుకుంటుంది. ఆమె అందం, వ్యాపార చతురత అందరినీ ఆకట్టుకుంటాయి. ఇషా అంబానీ తన చర్మ సంరక్షణ కోసం ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే మిలియనీర్ అయినప్పటికీ, ఆమె తన చర్మ సంరక్షణ కోసం హోం రెమిడీస్‌నే ఫాలో అవుతారట. తాను ఎలాంటి మాయిశ్చరైజర్ లేదా ఫేస్ వాష్ ఉపయోగించనని ఇషా అంబానీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇషా.. తన చర్మం మెరిసిపోయేలా ఉండేందుకు సహజసిద్ధమైన ఉత్పత్తులను మాత్రమే నమ్ముతానని, వాటినే ఉపయోగిస్తానని చెప్పారు. ప్రత్యేక ఈవెంట్ సమయాల్లో ఇషా.. స్మోకీ లుక్‌లో కనిపించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది. దాని కోసం కొద్దిగా మేకప్ వేసుకుంటారట.. ఈ రకమైన మేకప్ ఆమె అందాన్ని పెంచుతుంది. ఆమె మేకప్‌లో హైలైటర్‌ను ఇష్టపడుతారు. ఇది బుగ్గలకు మెరుపునిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూగ జీవాలే అతని టార్గెట్.. విషం పెట్టి మరీ..
భక్తుడి బ్యాగ్‌లోని సెల్ ఫోన్ కొట్టేసిన కోతి.. పాపం ముప్పతిప్పలు పెట్టి చివరికి ??
Dhanush: నయనతారపై కేసు పెట్టిన ధనుష్
రిలీజ్ అయిన 20 రోజుల్లోనే OTTకి వచ్చిన నిఖిల్ కొత్త సినిమా
Top 9 ET News: పుష్ప2కు రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ మనోడే టాప్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

