Fennel Seeds: మహిళలు సోంపు తిన్నారంటే.. ఈ సమస్యల్ని దూరమవుతాయి..

రెస్టారెంట్లకు వెళ్లి తినడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా ఫుడ్‌కి సంబంధించిన వీడియోలు ఎక్కువై పోయాయి. ఎక్కువగా ఇవే రీల్స్ కనిపిస్తున్నాయి. ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా భోజనం తిన్న తర్వాత.. బిల్లుతో పాటు సోంపు అనేది ఇస్తారు. నిజానికి ఇది ఇప్పటిది కాదు. పూర్వ కాలం నుంచి భారతీయులు భోజనం తిన్న తర్వాత సోంపు తినడం అలవాటు. సోంపును అనేక రకాల వంటకాల్లో..

Fennel Seeds: మహిళలు సోంపు తిన్నారంటే.. ఈ సమస్యల్ని దూరమవుతాయి..
Fennel Seeds
Follow us

|

Updated on: Aug 07, 2024 | 5:47 PM

రెస్టారెంట్లకు వెళ్లి తినడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా ఫుడ్‌కి సంబంధించిన వీడియోలు ఎక్కువై పోయాయి. ఎక్కువగా ఇవే రీల్స్ కనిపిస్తున్నాయి. ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా భోజనం తిన్న తర్వాత.. బిల్లుతో పాటు సోంపు అనేది ఇస్తారు. నిజానికి ఇది ఇప్పటిది కాదు. పూర్వ కాలం నుంచి భారతీయులు భోజనం తిన్న తర్వాత సోంపు తినడం అలవాటు. సోంపును అనేక రకాల వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు. దీంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సోంపులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో సోంపు ఎంతో చక్కగా పని చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా సోంపును ఉపయోగించే వారు. అయితే సోంపును మహిళలు తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి మహిళలు సోంపు తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రొమ్ము క్యాన్సర్‌కు చెక్:

సోంపులో అనెథాల్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనికి క్యాన్సర్‌తో పోరాడే గుణం ఉంది. పలు అధ్యయనాల ప్రకారం మహిళలు సోంపు తినడం వల్ల.. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. రొమ్మ క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందకుండా నిరోధించే శక్తి సోంపులో ఉంది. కాబట్టి మహిళలు సోంపు తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది:

సాధారణంగా ఇతరులతో పోల్చితే.. పెళ్లైన మహిళల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చేరుతుంది. సోంపు తినడం వల్ల కొవ్వు వెన్నలా కరిగిపోతుంది. సోంపు వేసి నానబెట్టిన టీ తాగితే చాలా మంచిది. సోంపులో ఫైబర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సోంపు తిన్న తర్వాత ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు:

సోంపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. సోంపు తినడం వల్ల శరీరంలో బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుదలను అడ్డుకుంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

నెలసరి సమస్యలు మాయం:

మహిళలు ప్రతి రోజూ ఒక స్పూన్ సోంపు నమిలి తినడం వల్ల నెలసరి సమస్యలు అనేవి తగ్గుతాయి. పీరియడ్స్‌లో వచ్చే కడుపులో నొప్పి, తిమ్మిర్లు , పొట్ట నొప్పి, చికాకు వంటివి కంట్రోల్ అవుతాయి.

అనేక లాభాలు:

సోంపు తినడం వల్ల డయాబెటీస్, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్, నరాల సమస్యలు, జీర్ణ సమస్యలు, ఊబకాయం వచ్చే సమస్యలు తగ్గుతాయి. కాబట్టి మహిళలు ఖచ్చితంగా ప్రతి రోజూ ఒక స్పూన్ సోంపు తినండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..