Weight Loss: జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది.. ఆ మహిళ చెప్తున్న వెయిట్ లాస్ టిప్స్ ఇవే
బరువు తగ్గడం అంటే జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చడం, కఠినమైన డైట్ పాటించడం మాత్రమే అనుకుంటారు చాలామంది. కానీ, ఓ మహిళ మాత్రం అలాంటివేవీ లేకుండానే ఏకంగా 30 కిలోల బరువు తగ్గింది. ఆమె పేరు ఉదిత అగర్వాల్. ఎన్నోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఉదిత, తన బరువు తగ్గడం వెనుక ఉన్న సాధారణ దినచర్యలను పంచుకుంది. మరి, ఆమె పాటించిన ఆ ఎనిమిది అలవాట్లు ఏమిటో తెలుసుకుందామా?

శరీర బరువు తగ్గించుకోవడం శారీరక శ్రమ, ఆహార నియంత్రణకు మించి మానసిక స్థైర్యం పైనా ఆధారపడి ఉంటుంది. జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోల బరువు తగ్గింది ఓ యువతి. ఆమె అనుభవాలు, పద్ధతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఉదిత అగర్వాల్ బరువు తగ్గడానికి కఠిన వ్యాయామాలు, కఠినమైన ఆహార నియమాలు పాటించలేదు. కొన్ని సులువైన రోజువారీ అలవాట్లు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంది. ఏప్రిల్ నెలలో ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో, బరువు తగ్గడానికి సాయపడిన ఎనిమిది దినచర్యలు ఆమె వివరించింది.
బరువు తగ్గడానికి ఉదిత పాటించిన 8 అలవాట్లు:
ప్రతిరోజు డిటాక్స్ వాటర్:
మెంతి, సోంపు, అజ్వైన్, జీలకర్ర కలిపి మరిగించిన డిటాక్స్ వాటర్ ఉదిత ప్రతిరోజు తాగింది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుందని ఆమె తెలిపింది.
బరువును ప్రతిరోజు పరిశీలించడం:
బరువు అప్పుడప్పుడు పెరిగినా, దాన్ని చూసి నిరాశ పడలేదు. బరువును ప్రతిరోజు చూస్తూ, తన నియమాలను క్రమం తప్పకుండా పాటించింది. “స్కేలుపై అంకెలు నా ఆలోచనను ప్రభావితం చేయలేదు, నేను స్థిరంగా ఉన్నాను” అని ఆమె చెప్పింది.
చీట్ డే:
చిన్నపాటి చీట్ మూమెంట్ ఎదురైనా, దాన్ని పట్టుకుని రోజు మొత్తం పాడు చేసుకోలేదు. వెంటనే తన దినచర్యను తిరిగి ప్రారంభించింది, తన నియమాలకు కట్టుబడింది.
టీతో స్నాక్స్ వద్దు:
ప్రతిరోజు టీ తాగేటప్పుడు ప్యాకేజ్ చేసిన లేదా వేయించిన స్నాక్స్ తినడం మానేసింది. ఇది అనాలోచితంగా తినడాన్ని నివారించింది.
ఇంటి భోజనం:
బయట కార్యక్రమాలకు వెళ్ళినా లేదా పనుల మీద బయట ఉన్నా, అనారోగ్యకరమైన ఆహారం తినకుండా ఉండేందుకు ఇంట్లో వండిన భోజనాన్ని టిఫిన్‌గా తీసుకెళ్లింది.
నానబెట్టిన చియా సీడ్స్:
ప్రతిరోజు 3 నుండి 4 లీటర్ల నీరు తాగడంతో పాటు, అర లీటరు నీటిలో చియా సీడ్స్ నానబెట్టి, ఆ డిటాక్స్ పానీయాన్ని రోజంతా తాగింది. మైదాకు “నో”: చక్కెరను పూర్తిగా మానేయకుండానే, మైదాను ఆహారం నుండి తొలగించింది. ఇది వాస్తవానికి, నిలకడకు ఆస్కారమిచ్చే అలవాటు.
భోజనానికి ముందు వాటర్:
ప్రతి భోజనానికి ముందు నీరు తాగడం ఒక సులువైన, ప్రభావవంతమైన అలవాటు. ఇది ఎక్కువగా తినడాన్ని నివారించింది, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచింది. బరువు తగ్గడానికి ఉదిత సరళమైన అలవాట్లను పాటించినా, బరువు తగ్గడం ప్రారంభించే ముందు ధృవీకరించబడిన పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.




