Winter Tips For Babies: శీతాకాలంలో శిశువు హాయిగా పడుకోవట్లేదా? ఈ టిప్స్ పాటిస్తే ప్రశాంతంగా పడుకుంటారు

| Edited By: Anil kumar poka

Jan 04, 2023 | 6:41 PM

శీతాకాలంలో శిశువులను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంచాలంటే పొడి వాతారవణం ఉండాలి. చలి కాలంలో పిల్లలకు వేసే దుస్తుల నుంచి చలి నుంచి రక్షణ కోసం తీసుకునే చర్యలు ప్రతీది చాలా ముఖ్యమైందే అని నిపుణులు చెబుతున్నారు.

Winter Tips For Babies: శీతాకాలంలో శిశువు హాయిగా పడుకోవట్లేదా? ఈ టిప్స్ పాటిస్తే ప్రశాంతంగా పడుకుంటారు
Kids Bed Wetting
Follow us on

శీతాకాలంలో అందరూ వెచ్చదనాన్ని కోరుకుంటారు. ఏ మాత్రం చలి వేసినా ఇబ్బందిగా ఫీలవుతారు. మనమైతే ఇబ్బందిని తెలియజేస్తాం కానీ చిన్నపిల్లలు అంటే రెండేళ్ల కంటే తక్కువ ఉన్న చిన్నపిల్లలు తమ ఇబ్బందిని ఎలా తెలియజేస్తారు? వారికి ఇబ్బంది కలిగితే ఏడ్వడం తప్ప ఏం చేయలేరు. తరచూ ఏడుస్తూ ఉండడంతో పిల్లలు పడుకునే సమయం కూడా డిస్ట్రబ్ అవుతుంది. శీతాకాలంలో శిశువులను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంచాలంటే పొడి వాతారవణం ఉండాలి. చలి కాలంలో పిల్లలకు వేసే దుస్తుల నుంచి చలి నుంచి రక్షణ కోసం తీసుకునే చర్యలు ప్రతీది చాలా ముఖ్యమైందే అని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో శిశువుల రక్షణకు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. 

వన్ పీస్ బాడీ సూట్

చలికాలంలో శిశువులకు వన్ పీస్ బాడీ సూట్లు వేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. రెండుగా ఉండే బట్టలు వేయడం వల్ల అవి మార్చే సమయంలో పిల్లులు ఇబ్బంది పడతారు. వన్ పీస్ బాడీ సూట్లు వేస్తే డైపర్లు వంటివి మార్చే సమయంలో సౌకర్యవంతంగా ఉంటుంది. 

సౌకర్యవంతమైన డైపర్లు

చలికాలంలో సాధారణంగా పిల్లలు ఎక్కువ మూత్ర విసర్జన చేస్తుంటారు. ఎక్కువగా పడుకునే సమయంలో మూత్ర విసర్జన చేస్తారు కాబట్టి అందరూ శిశువుల నిద్ర భంగం కలుగకుండా డైపర్లు వేస్తారు. కానీ ఎక్కువ మూత్రం కారణంగా డైపర్లు లీకయ్యే చాన్స్ ఉంది. కాబట్టి లీక్ ప్రూఫ్ డైపర్లు వాడాలి.

ఇవి కూడా చదవండి

వెచ్చని దుప్పట్లు

చలికాలంలో సాధరణంగా దుప్పటి కప్పాలి కాబట్టి కచ్చితంగా సౌకర్యంగా ఉండేలా రెండు నుంచి మూడు దుప్పట్లు కేవలం శిశువుకు మాత్రమే వాడాలి. ఎందుకంటే శిశువు తరచూ దుప్పట్లు పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి రెండు నుంచి మూడు దుప్పట్లు మెయిన్ టెయిన్ చేస్తే వాష్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దుప్పట్లు కప్పె సమయంలో పూర్తిగా శిశువు బాడీ అంతా కవరయ్యే చుట్టినట్లు కప్పాలి. ఎందుకంటే ఇలా చేస్తే దోమల నుంచి రక్షణగా ఉంటుంది. 

హ్యుమిడిఫైర్ వాడకం

చలికాలంలో శిశువు ఉన్న ఇళ్లల్లో కచ్చితంగా హ్యుమిడిఫైర్ వాడడం ఉత్తమం. ఎందుకంటే శీతాకాలంలో సహజంగా వాతావరణం తేమగా ఉంటుంది. ఈ సమయంలో శిశువు ఉన్న రూమ్ లో హ్యుమిడిఫైర్ పెట్టడం వల్ల గదిలో ఉన్న తేమను పీల్చేస్తుంది. అలాగే చలికాలంలో శిశువును ఇబ్బంది పెట్టె జలుబు, దగ్గు నుంచి రక్షణ ఉంటుంది. 

అధిక రక్షణ చర్యలు

శీతాకాలంలో శిశువు కాళ్లు, చేతులు రక్షణకు వెచ్చని సాక్స్ వేయడం ఉత్తమం. అంచనా ప్రకారం సాక్సులు కొని తీసుకొచ్చి వేయడం కంటే బయటకు తీసుకెళ్లినప్పుడు వారి కరెక్ట్ గా ఫిట్ అయ్యే సాక్సులు కొనాలి. అలాగే చేతులకు సాక్సులు వాడడం వల్ల పిల్లలు ముఖాన్ని గిల్లుకోకుండా రక్షణగా ఉంటుంది. 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం