Pneumonia Tips: శీతాకాలంలో న్యూమోనియా చెక్ పెట్టాలంటే.. ఈ టిప్స్ తప్పక ఫాలో కావాల్సిందే..
న్యుమోనియా అనేది ద్రవం లేదా శ్లేష్మం చేరడం వల్ల కలిగే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. న్యూమోనియా వస్తే రక్తంలోకి ఆక్సిజన్ సరఫరా శాతం బాగా తగ్గుతుంది. చాలా మంది న్యూమోనియా అంటే అంటు వ్యాధి అనుకుంటారు కానీ ఇది వివిధ కారణాల వల్ల సంభవిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో అంతా జలుబు, దగ్గుతో పాటు అనేక ఇతర అనారోగ్యాలకు గురవుతారు. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుకు అనుగుణంగా, మన శరీరాలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. సాధారణ జలుబు మరియు దగ్గుతో పాటు, ఈ సీజన్‌లో న్యుమోనియా వచ్చే అవకాశాలు అధికంగా ఉంటుంది. న్యుమోనియా అనేది ద్రవం లేదా శ్లేష్మం చేరడం వల్ల కలిగే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. న్యూమోనియా వస్తే రక్తంలోకి ఆక్సిజన్ సరఫరా శాతం బాగా తగ్గుతుంది. చాలా మంది న్యూమోనియా అంటే అంటు వ్యాధి అనుకుంటారు కానీ ఇది వివిధ కారణాల వల్ల సంభవిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే శీతాకాలంలో న్యుమోనియా నుంచి రక్షణ కోసం కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు.
న్యుమోనియా నివారించే మార్గాలు
వ్యాక్సినేషన్
న్యుమోనియా నివారణకు టీకాలు వేయించుకోవడం ఉత్తమమైన మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. న్యూమోనియా వ్యాక్సిన్లలో రెండు రకాలు ఉంటాయి. న్యుమోకాకిల్ కంజుగేట్ వ్యాక్సిన్, న్యుమోకాకిల్ పాలిసాకరైడ్ వ్యాక్సిన్. ఈ టీకాలను వేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత
న్యుమోనియా నుంచి రక్షణ కోసం శరీర ఉష్టోగ్రతను క్రమబద్ధీకరించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఎల్లప్పుడు శరీరాన్ని కప్పి ఉంచే ధరించాలి. చేతుల్లో బ్యాక్టిరియా చేరకుండా ప్రతి సారి కడుక్కోవాలి. అలాగే ముక్కు, నోటిని తరచూ చేతితో తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ కాలుష్యం నుంచి బయటపడడానికి జాగింగ్ చేయకుండా ఇంట్లోనే వ్యాయామం చేయడం ఉత్తమం. ఇంట్లో దుమ్ము చేరకుండా తరచూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే శ్వాసకోశ ఇబ్బందులు రాకుండా ప్రాణాయామం చేయడం ఉత్తమం.




ధూమపానానికి దూరం
శీతాకాలంలో న్యుమోనియా నుంచి రక్షణ కోసం ధూమపానానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ధూమపానం అలవాటు ఉన్నవారు న్యుమోకాకిల్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనని వైద్యులు పేర్కొంటున్నారు.
రోగులకు దూరంగా ఉండాల్సిందే
శ్వాసకోశ ఇన్ ఫెక్షన్ల ప్రభావాన్ని తగ్గించడానికి అనారోగ్యానికి గురైన వారి నుంచి ఆరు అడుగుల దూరం పాటించాలి. కౌగలించుకోవడం, కరచాలనం వంటివి చేయకూడదు. శీతాకాలంలో జలుబు ఎంతటికీ తగ్గకపోతే న్యుమోనియా వరకూ వెళ్లకుండా ఉండాలంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి వైద్య సహాయం పొందాలి. అలాగే విటమిన్ సీ, జింక్ వంటి రోగనిరోధక శక్తిని పెంపొందించే సప్లిమెంట్స్ ను తీసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం