Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs RCB: అప్పుడెప్పుడో గెలిచారు.. మళ్లీ ఇన్నేళ్లకు..! ఈ మధ్యలో ఎన్ని జరిగాయో తెలుసా? నమ్మలేని నిజాలు

ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) పై చెపాక్ వేదికగా 50 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇది 2008 తర్వాత చెపాక్ లో ఆర్సీబీ సాధించిన తొలి విజయం. ఈ విజయం కోహ్లీ కెరీర్, ఐపీఎల్ లో పాక్ ఆటగాళ్ల ఉనికి, డీఆర్ఎస్ లేని కాలం వంటి విషయాలను గుర్తు చేస్తుంది. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు చేసిన తర్వాత కూడా ఇదే మైదానంలో ఆర్సీబీ విజయం సాధించింది.

SN Pasha

|

Updated on: Mar 29, 2025 | 8:22 AM

ఐపీఎల్‌ 2025లో భాగంగా శుక్రవారం చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఆర్సీబీ విజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో పూర్తిగా డామినేట్‌ చేసి 50 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే.. ఈ విజయంతో గత 16 ఏళ్లుగా చెపాక్‌లో విజయం లేని లోటును ఆర్సీబీ తీర్చుకుంది. అప్పుడెప్పుడో 2008లో రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్సీలోని ఆర్సీబీ సీఎస్‌కేను చెపాక్‌లో ఓడించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు సీఎస్‌కే చెపాక్‌లో ఓడించింది. అయితే 2009 ఐపీఎల్‌ సౌతాఫ్రికాలో జరగడం, 2016, 2017 సీజన్స్‌లో బ్యాన్‌ అయిన విషయం తెలిసిందే.

1 / 5
అయితే.. 2008లో ఆర్సీబీ, సీఎస్‌కే చెపాక్‌లో గెలిచినప్పుడు విరాట్‌ కోహ్లీ ఇంకా టీమిండియాకు ఆడలేదు. ఇప్పుడు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌ రిటైర్మెంట్‌ కూడా ప్రకటించాడు. 82 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఫేస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ క్రికెట్‌గా ఎదిగాడు. అంటే.. సీఎస్‌కే చెపాక్‌లో ఆర్సీబీ ఫస్ట్‌ విజయానికి, రెండో విజయానికి మధ్య కోహ్లీ అనే గొప్ప ఆటగాడి కెరీర్‌ ఉందన్న మాట.

2 / 5
అలాగే ఫస్ట్‌ టైమ్‌ సీఎస్‌కేపై ఆర్సీబీ గెలిచిన సమయంలో ఐపీఎల్‌లో పాకిస్థాన్‌ క్రికెటర్లు కూడా ఆడుతున్నారు. చాలా టీమ్స్‌లో పాక్‌ ఆటగాళ్లు భాగంగా ఉన్నారు. పాక్‌ మాజీ క్రికెటర్లు.. షాహిద్‌ అఫ్రిదీ, షోయబ్‌ అక్తర్‌, షోయబ్‌ మాలిక్‌, మొహమ్మద్‌ ఆసిఫ్‌, మిస్బా ఉల్‌ హక్‌ వంటి ఒక్కప్పటి స్టార్లు ఐపీఎల్‌ ఆడుతున్న రోజుల్లో సీఎస్‌కే పై ఆర్సీబీ గెలిచింది.

3 / 5
చెపాక్‌ వేదికగా సీఎస్‌కేపై ఆర్సీబీ గెలిచిన సమయంలో అంత్జాతీయ క్రికెట్‌లో ఇంకా డీఆర్‌ఎస్‌(డిసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) అనేదే లేదు. అంటే క్రికెట్‌లో అదో ప్రాచీన కాలంగా సరదాగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కూడా అనే రూల్స్‌ క్రికెట్లో వచ్చాయి.

4 / 5
క్రికెట్‌ గాడ్‌, అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు సాధించిన ది గ్రేట్‌ సచిన్‌ టెండూల్కర్‌ అప్పటి ఇంకా 81 సెంచరీలు మాత్రమే చేసి ఉన్నాడు. వంద సెంచరీల మార్క్‌ అందుకోవడానికి ఇంకా 19 సెంచరీలు వెనుకబడి ఉన్న రోజుల్లో సీఎస్‌కేను చెపాక్‌లో ఆర్సీబీ ఓడించింది. ఆయన వంద సెంచరీలు చేసి, అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి దశాబ్ధం అయిన తర్వాత మళ్లీ రెండో సారి చెపాక్‌లో ఆర్సీబీ గెలిచింది. తొలి విజయానికి, రెండో విజయానికి ఉన్న గ్యాప్లో ఇన్ని జరిగాయి.

5 / 5
Follow us