వేసవిలో దోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

samatha 

28 march 2025

Credit: Instagram

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది డీ హైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంటారు. అందువలన ఈ వేసవి కాలంలో తప్పకుండా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు.

ఇక వేసవివచ్చిందంటే చాలు జ్యూస్‌లు తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతంటారు. వివిధరకాల జ్యూస్‌లు మనకు దొరుకుతుంటాయి. కానీ ఈ ఎండాకాలంలో కీరదోస జ్యూత్ తాగాలంటున్నారు వైద్యులు.

సమ్మర్‌లో దోసకాయ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదంట. కాగా, వేసవిలో ఈ జ్యూస్ తాగడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

దోసకాయను చాలా మంది సలాడ్‌లా తీసుకుంటారు. అయితే దీనిని జ్యూస్ లా తీసుకోవడం వలన మీ చర్మం నిగారింపుగా తయారు అవుతుందంట. అంతే కాకుండా  అది మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

అదే విధంగా వేసవిలో కీరదోస జ్యూస్ తాగడం వలన మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అలాగే దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన ఈజీగా బరువు తగ్గుతారంట. ఇందులోని యాంటి ఆక్సిడెంట్స్ మీ శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా, రోగనిరోధకశక్తిని పెంచుతాయి.

వేసవిలో ప్రతి రోజూ దోసకాయ జ్యూస్ తాగడం వలన ఇది మీ శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి దోహదం చేస్తుందంటున్నారు వైద్యలు.

అలాగే వేడి వాతావరణంలో వ్యాయామం చేస్తున్న సమయంలో మీరు చెమట ద్వారా కోల్పోయిన నీటిని తిరిగి నింపడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందంట. అందువలన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ జ్యూస్ తాగాలంట.