AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్‌ వాడకంలో అంత అతివద్దు.. మైగ్రెన్‌ తలనొప్పి పర్మినెంట్‌గా తిష్టవేస్తుంది! జాగ్రత్త..

కొందరు కాలక్షేపం కోసం ఫోన్ ఉపయోగిస్తే.. మరికొందరు వృత్తి రిత్యా వాడుతున్నారు. కారణం ఏదైనా స్క్రీన్ సమయం పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో మైగ్రేన్ సమస్యను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ సమయానికి, మైగ్రేన్‌కు మధ్య సంబంధం ఏమిటి? ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది? వంటి విషయాలు నిపుణుల మాటల్లో మీ కోసం..

ఫోన్‌ వాడకంలో అంత అతివద్దు.. మైగ్రెన్‌ తలనొప్పి పర్మినెంట్‌గా తిష్టవేస్తుంది! జాగ్రత్త..
Screen Time And Migraine
Srilakshmi C
|

Updated on: May 11, 2026 | 9:13 PM

Share

నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల వాడకం పెరగడంతో స్క్రీన్ సమయం కూడా గణనీయంగా పెరిగింది. దీని ఫలితంగా కళ్ళు,మెదడుపై ఒత్తిడి పెరిగి తలనొప్పులు, మైగ్రేన్ సమస్యలు అధికమవుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. కొందరు కాలక్షేపం కోసం దీనిని ఉపయోగిస్తే మరికొందరు వృత్తి రిత్యా వాడుతున్నారు. కారణం ఏదైనా స్క్రీన్ సమయం పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో మైగ్రేన్ సమస్యను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ సమయానికి, మైగ్రేన్‌కు మధ్య సంబంధం ఏమిటి? ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది? వంటి విషయాలు నిపుణుల మాటల్లో మీ కోసం..

స్క్రీన్ సమయానికి – మైగ్రేన్‌లకు మధ్య సంబంధం

నిపుణుల అభిప్రాయం ప్రకారం స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్ళపై నిరంతరం ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి కళ్ళను త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఇది మెదడుపై మరింత ఒత్తిడిని కలిగించి, మైగ్రేన్‌లకు దారితీసేలా చేస్తుంది. మైగ్రేన్ ప్రారంభమయ్యే ముందు కొంతమందికి మినుకుమినుకుమనే కాంతి, తల బరువుగా అనిపించడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?

రోజంతా కంప్యూటర్లు లేదా మొబైల్ ఫోన్లు వాడే వారికి మైగ్రేన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నేటి కాలంలో పిల్లలు, యువతలో ఈ సమస్య పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మైగ్రేన్లతో బాధపడుతున్న వారు స్క్రీన్‌ను అధికంగా వాడటం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎక్కువసేపు స్క్రీన్‌ను చూడటం వల్ల కళ్లు పొడిబారడం, కళ్లలో చికాకు, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కలుగుతాయి. ఈ కారణాలన్నీ కలిసి తలనొప్పులు, మైగ్రేన్ల సమస్యను పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

దీన్ని ఎలా నివారించాలి?

వీటి నివారణకు స్క్రీన్ వాడకాన్ని నియంత్రించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి 20-30 నిమిషాలకు విరామం తీసుకోవాలి. కళ్ళకు విశ్రాంతి ఇవ్వడానికి దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. స్క్రీన్ బ్రైట్‌నెస్ సరిగ్గా ఉండాలి. చీకటిలో మొబైల్ వాడటం మానుకోవాలి. సరైన నిద్ర, సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మైగ్రేన్‌లను నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరం ఇచ్చే సంకేతాలను విస్మరించకుండా, సకాలంలో వైద్య సలహా తీసుకోవడం అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం స్క్రీన్ వాడకాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం వల్ల మైగ్రేన్‌ల ప్రమాదాన్ని తగ్గించి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us
ఫోన్‌ వాడకంలో అతివద్దు.. మైగ్రెన్‌ పర్మినెంట్‌గా తిష్టవేస్తుంది!
ఫోన్‌ వాడకంలో అతివద్దు.. మైగ్రెన్‌ పర్మినెంట్‌గా తిష్టవేస్తుంది!
అతి ఆలోచనలతో BP టెన్షన్‌.. మనసుకు రిపేర్‌ చేయకుంటే గుండెకు చేటు
అతి ఆలోచనలతో BP టెన్షన్‌.. మనసుకు రిపేర్‌ చేయకుంటే గుండెకు చేటు
చేతిలో కన్ఫర్మ్ రైలు టికెట్ ఉన్నా.. రూ.2560 జరిమానా..కారణం ఇదే..!
చేతిలో కన్ఫర్మ్ రైలు టికెట్ ఉన్నా.. రూ.2560 జరిమానా..కారణం ఇదే..!
జ్యోతిష్యంలోనే వెరీ డేంజర్.. ఆ సమయం మొదలైతే వీరికి చుక్కలే..
జ్యోతిష్యంలోనే వెరీ డేంజర్.. ఆ సమయం మొదలైతే వీరికి చుక్కలే..
46 ఏళ్ల వయస్సులో ఇలా ఎలా..? ఆమె ఆన్సర్ ఇదే..
46 ఏళ్ల వయస్సులో ఇలా ఎలా..? ఆమె ఆన్సర్ ఇదే..
క్రెడిట్ కార్డుదారుడు మరణిస్తే ఆ అప్పు ఎవరు చెల్లించాలి?
క్రెడిట్ కార్డుదారుడు మరణిస్తే ఆ అప్పు ఎవరు చెల్లించాలి?
అరుదైన గ్రహాల కలయిక.. దెబ్బకు సీన్ మొత్తం ఛేంజ్
అరుదైన గ్రహాల కలయిక.. దెబ్బకు సీన్ మొత్తం ఛేంజ్
నేను విష్ణుప్రియ సబ్‌స్క్రైబర్‌ని.. రూ.399 కట్టా: టాలీవుడ్ నటుడు
నేను విష్ణుప్రియ సబ్‌స్క్రైబర్‌ని.. రూ.399 కట్టా: టాలీవుడ్ నటుడు
నష్టాలు, నమ్మకద్రోహాలు.. కాలసర్ప దోషంతో ఈ రాశులు జాగ్రత్త!
నష్టాలు, నమ్మకద్రోహాలు.. కాలసర్ప దోషంతో ఈ రాశులు జాగ్రత్త!
మీరు ఒక గంట పాటు మీ మొబైల్ లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
మీరు ఒక గంట పాటు మీ మొబైల్ లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?