కిడ్నీలు ఎల్లప్పుడూ యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 5 ఆహారాలు తినండి!

July 17, 2026

Subhash

మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి రోజులో 24 గంటలూ నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి వీటిని సంరక్షించుకోవడం మన బాధ్యత.

కిడ్నీల ఆరోగ్యం

బయట దొరికే వేపుళ్ళు, మైదా, చక్కెర, ఎక్కువ ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్ (నిల్వ ఉంచిన ఆహారాలు) కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యం కోసం మంచి ఆహార అలవాట్లు ముఖ్యం.

హాని చేసే ఆహారాలు

ఆకుకూరలు కిడ్నీలను క్లీన్ చేయడంలో బాగా సహాయపడతాయి. వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి.

ఆకుకూరలు

ఫ్యాటీ ఫిష్ కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో వాపులను, బ్లడ్ ఫ్యాట్స్‌ను తగ్గిస్తాయి. ఇది గుండెతో పాటు కిడ్నీలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఒమేగా-3

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీల్లో వచ్చే వాపులను, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి.

వెల్లుల్లి

ఎర్ర క్యాప్సికమ్‌లో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ A, C, B6, ఫోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది కిడ్నీలపై ఎలాంటి అదనపు భారం పడకుండా రుచితో పాటు సరైన పోషకాలను అందిస్తుంది.

ఎర్రటి క్యాప్సికమ్

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, క్రాన్‌బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, చెర్రీస్ వంటి వాటిలో ఫైబర్, విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. 

బెర్రీలు

ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలతో ఎందరో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో  కిడ్నీల ఆరోగ్యం కోసం మంచి ఆహారాలను తీసుకుంటే ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కిడ్నీ సమస్యలు