AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యాభర్తలకు సూపర్ స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.9250.. పూర్తి వివరాలు ఇవే..

మీ కష్టార్జితానికి వంద శాతం ప్రభుత్వ భద్రత ఉంటూ.. ప్రతి నెలా చేతికి ఖచ్చితమైన ఆదాయం వచ్చే పథకం కోసం చూస్తున్నారా? అయితే మీకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ బెస్ట్. ప్రస్తుతం 7.4శాతం వడ్డీ రేటును అందిస్తున్న ఈ పథకంలో అసలు ఎంత పెట్టుబడి పెట్టాలి? నెలకు రూ.9250 ఆదాయాన్ని ఎలా సంపాదించాలి..? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Jul 18, 2026 | 5:37 PM

Share
ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం పెట్టుబడిదారులకు స్థిరమైన నెలవారీ పారితోషికాన్ని అందించడం. ఇందులో చేరాలనుకునే వారు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా జమ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతి నెలా పెట్టుబడిదారుడి పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం సంవత్సరానికి 7.4శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మార్పులు చేస్తుంటుంది.

1 / 5
పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ పథకంలో ఖాతా తెరవడానికి నిబంధనలు చాలా ఈజీగా ఉంటాయి. ఇందులో సింగిల్ అకౌంట్, జాయింట్ అకౌంట్ అనే రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక వ్యక్తి తన పేరిట వ్యక్తిగత ఖాతా తెరిస్తే గరిష్టంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అదే భార్యభర్తలు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి ఉమ్మడి ఖాతాను తెరిచినట్లయితే, పెట్టుబడి పరిమితి రూ.15 లక్షల వరకు పెరుగుతుంది. ఈ గరిష్ట పరిమితుల ఆధారంగానే నెలవారీ వచ్చే ఆదాయం కూడా మారుతుంది.

2 / 5
నెలకు రూ.9250 ఆదాయం:  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పథకం ద్వారా నెలకు దాదాపు రూ.10,000 ఆదాయం వస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో నిజం లేకపోలేదు. పెట్టుబడిదారులు జాయింట్ అకౌంట్ ద్వారా గరిష్ట పరిమితి అయిన రూ.15 లక్షలను ఇందులో ఇన్వెస్ట్ చేస్తే, 7.4శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం ఏడాదికి సుమారు రూ.1,11,000 వడ్డీ వస్తుంది. దీనిని నెలవారీగా లెక్కిస్తే గరిష్టంగా నెలకు రూ.9,250 అందుతుంది.

3 / 5
ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని ముఖ్యమైన షరతులను తప్పక గుర్తుంచుకోవాలి. ఖాతా తెరిచిన ఒక సంవత్సరం లోపు ఈ డబ్బును విత్‌డ్రా చేయడానికి లేదా అకౌంట్ క్లోజ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఒక సంవత్సరం దాటిన తర్వాత మూడు సంవత్సరాల లోపు ఖాతాను మూసివేస్తే, డిపాజిట్ చేసిన మొత్తం నుండి 2శాతం పెనాల్టీగా మినహాయించుకుంటారు. మూడు సంవత్సరాల తర్వాత మూసివేస్తే 1శాతం కట్ అవుతుంది. అందుకే ఈ పథకం పూర్తి ప్రయోజనం పొందాలంటే మెచ్యూరిటీ కాలం వరకు కొనసాగించడం ఉత్తమం.

4 / 5
ఎవరికి బెస్ట్..?: రిస్క్ లేని పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తూ, రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని ఆశించే సీనియర్ సిటిజన్లకు, మహిళలకు ఈ పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం బెస్ట్ ఆప్షన్. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా ప్రభుత్వ గ్యారెంటీతో డబ్బులు రావడమే దీని ప్రత్యేకత. అయినప్పటికీ పెట్టుబడి పెట్టే ముందు మీ వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలను, ప్రస్తుత వడ్డీ రేట్లను మరియు మీ కుటుంబ అవసరాలను ఒకసారి బేరీజు వేసుకుని ముందడుగు వేయడం మంచిది.

5 / 5
Follow Us
భార్యాభర్తలకు సూపర్ స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ..

బోనాల స్పెషల్.. పొట్టేల్ కర్రీ త్వరగా ఉడికి, రుచిగా ఉండాలా?

బంగాళాదుంపలు ఆకుపచ్చగా మారితే ఏం చేయాలి? తినడానికి సురక్షితమా ?

భూమిపై తీరం లేని ఏకైక సముద్రం.. అయోమయంలో శాస్త్రవేత్తలు..ఆ రహస్యం

భర్తను చంపేందుకు భార్య భయానక కుట్ర..!
భర్తను చంపేందుకు భార్య భయానక కుట్ర..!
వారికి అదృష్ట కాలం.. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ పక్కా..!

చిటికెలో శరీరం మొత్తం యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..

'ది ప్యారడైజ్'పై రూ.110 కోట్ల రూమర్స్... మేకర్స్ ఇచ్చిన క్లారిటీ

ఛీ.. ఇదేం వరల్డ్ కప్ ఫార్మాట్! ఐసీసీపై కెప్టెన్ల మండిపాటు

'లెనిన్'తో మారిన అఖిల్... ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!