AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snoring Facts: మీ గురక మీకెందుకు వినిపించదో తెలుసా? స్టడీలో బయటపడ్డ ఇంట్రెస్టింగ్ విషయాలు!

ఎవరైనా గురక పెడుతుంటే ఆ సౌండ్ కు పక్కన ఉన్న వారికి అస్సలు నిద్ర పట్టదు. కానీ, గురక పెడుతున్నవాళ్లు మాత్రం హాయిగా నిద్రపోతారు. అయితే మీకెప్పుడైనా అనిపించిందా ఆ శబ్దం..  గురక పెడుతున్నవారికి ఎందుకు వినిపించదు అని. ఈ విషయంపైనే సైంటిస్టులు రీసెర్చ్ చేయగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అదేంటంటే.

Snoring Facts: మీ గురక మీకెందుకు వినిపించదో తెలుసా? స్టడీలో బయటపడ్డ ఇంట్రెస్టింగ్ విషయాలు!
Snoring Facts
Nikhil
|

Updated on: Oct 21, 2025 | 3:04 PM

Share

నిద్రలో గురక పెట్టే అలవాటు చాలామందికి ఉంటుంది. ఆ గురక సౌండ్ కు పక్కన ఉన్నవాళ్లంతా చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ, ఆ శబ్దం గురక పెడుతున్న వ్యక్తిని మాత్రం డిస్టర్బ్ చేయదు. మరి ఆ సౌండ్ వారికి ఎందుకు వినిపించదు? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. గురక పెట్టే వారి బ్రెయిన్ కావాలని ఆ సౌండ్‌ను వినిపించుకోకుండా చేస్తుందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా నిద్రలో ఉన్నప్పుడు బ్రెయిన్ వేర్వేరు స్టేజెస్‌లోకి వెళ్తుంది. ఒక స్టేజ్ లో కలలు వస్తాయి. అప్పుడు బ్రెయిన్ పని చేస్తూనే ఉంటుంది. మరొక స్టేజ్ లో  గాఢ నిద్రలోకి వెళ్తుంది. అప్పుడు బ్రెయిన్ కూడా ఆఫ్ అయ్యి బాడీని, ఎనర్జీని రిపేర్ చేయడంపై ఫోకస్ పెడుతుంది. ఈ సమయంలో  బ్రెయిన్‌లో ఉండే థలామస్ అనే ఒక పార్ట్ చెవులు, స్కిన్ లాంటి వాటి నుంచి వచ్చే అనవసరమైన సిగ్నల్స్‌ను లోపలికి రాకుండా బ్లాక్ చేస్తుంది. అయితే గురక అనేది బాడీ నుంచే వచ్చే శబ్దం కాబట్టి బ్రెయిన్ దాన్ని ప్రమాదం లేని సౌండ్ గా పరిగణిస్తుంది. ఆ శబ్దం వల్ల  ఎలాంటి ప్రమాదం ఉండదు గనుక బ్రెయిన్ దాన్ని పట్టించుకోకుండా నిద్రలో నిమగ్నమవుతుంది.

ఇకపోతే గురక వినపడకపోవడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. అదేంటంటే.. గురక అనేది బయట నుంచి చెవులకు చేరే సౌండ్ కాదు. శ్వాస తీసుకున్నప్పుడు గాలి వెళ్లే దారికి అడ్డంకి ఏర్పడి, ఆ కండరాలు వైబ్రేట్ అవ్వడం వల్ల వచ్చే సౌండ్ కాబట్టి దీన్ని వైబ్రేషన్ గా చెప్పుకోవచ్చు. శరీరంలో పుట్టే ఇలాంటి వైబ్రేషన్స్ ను బ్రెయిన్ చాలా ఈజీగా గుర్తుపడుతుంది. అందుకే దాన్ని పెద్దగా పట్టించుకోదు. కానీ, అదే రూమ్‌లో ఉన్న ఇతరులకు మాత్రం ఆ సౌండ్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అదీ సంగతి.

ఏదేమైనా గురక అనేది కొన్నిసార్లు ఒక హెచ్చరిక కూడా కావచ్చు. శ్వాసలో వచ్చే ఇబ్బంది వల్ల గురక వస్తుంది కాబట్టి గురకను నెగ్లెక్ట్ చేయకూడదు. గురక సమస్య పెరిగితే హై బీపీ, గుండె జబ్బుల వంటి ప్రమాదాలు కూడా పెరుగుతాయి. కాబట్టి, పెద్దగా గురక పెట్టే వాళ్లు ఒకసారి డాక్టర్ ను కన్సల్ట్ అవ్వడం మంచిది.