Home Remedies for Shoe Bite: కొత్త చెప్పులు కరుస్తున్నాయా? ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం
స్టైలిష్‌గా కనిపించేందుకు రకరకాల చెప్పులు ధరించేవారికి.. వాటిని వేసుకోవాలంటే మాత్రం హడల్. ఎందుకంటే కొత్త చెప్పులు కరుస్తాయ్ మరి. చాలా మంది దుస్తులను బట్టి వివిధ రకాల చెప్పులు ధరిస్తారు. అందంగా కనిపించే అన్ని బూట్లు, చెప్పులను ముందే కొనేసి ఇంట్లో దాచేస్తుంటారు. అయితే ఇలా కొత్త చెప్పులు వేసుకున్న ప్రతిసారి అవి కరుస్తూ ఉంటాయి..

నేటి కాలంలో నిమిషానికో ఫ్యాషన్ పుట్టుకొస్తుంది. కొంచెమైనా స్టైలిష్ గా కనిపించాలని ఖరీదైన, స్టైలిష్ బట్టలు, చెప్పులు ధరిస్తుంటారు. అయితే బట్టల వరకు పరవాలేదుగానీ.. కొత్త చెప్పులు వేసుకోవాలంటేనే తిప్పలు తప్పవు. చాలా మంది దుస్తులను బట్టి వివిధ రకాల చెప్పులు ధరిస్తారు. అందంగా కనిపించే అన్ని బూట్లు, చెప్పులను ముందే కొనేసి ఇంట్లో దాచేస్తుంటారు. అయితే ఇలా కొత్త చెప్పులు వేసుకున్న ప్రతిసారి అవి కరుస్తూ ఉంటాయి. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక కొందరు తెగ ఇబ్బంది పడిపోతుంటారు. నిజానికి, మీరు కొనుగోలు చేసే బూట్లు లేదా చెప్పుల పరిమాణంలో స్వల్ప తేడా కూడా పాదాలకు బొబ్బలకు దారితీస్తుంటాయి. అందువల్ల, సౌకర్యవంతమైన బూట్లు, చెప్పులు మాత్రమే ఎల్లప్పుడూ కొనుగోలు చేయాలి. వాటినే ధరించడం మంచిది. కొత్త చెప్పులు ధరించడం వల్ల కాళ్లపై బొబ్బలు లేదా పుండ్లు వస్తే ఇంట్లోనే ఈ కింది విధంగా చికిత్స చేసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ఆయింట్‌మెంట్ రాస్తే మంట ఉండదు
కొత్త చెప్పుడు వేసుకోవడం వల్ల పాదాలపై కోతలు లేదా గీతలు ఏర్పడితే.. ఆ ప్రాంతాన్ని గాలి తగిలేలా ఉంచడం వల్ల ఎక్కువ క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ గాయాలు లేదా బొబ్బలపై రోజుకు రెండుసార్లు ఆయింట్‌మెంట్ రాస్తే త్వరగా గాయాలు మానుతాయి.
ఐస్ క్యూబ్స్
కొత్త బూట్లు ధరించినప్పుడు పాదాలకు గాయాలు అయితే, ఉపశమనం కోసం ఐస్ క్యూబ్స్ ఉపయోగించవచ్చు. కొన్ని ఐస్ క్యూబ్స్‌ను శుభ్రమైన గుడ్డలో చుట్టి, ప్రభావిత ప్రాంతంపై కాసేపు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఐస్ క్యూబ్ షూ కాటు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
అలోవెరా జెల్
షూ లేదా చెప్పులు కరిస్తే కలిగే గాయాలను తగ్గించడంలో అలోవెరా జెల్ ప్రభావవంతంగా ఉంటుంది. గాయాలపై కలబంద జెల్ రాసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే గాయం త్వరగా మానుతుంది.
ఆలివ్ ఆయిల్
షూ కరవడం వల్ల ఏర్పడిన గాయాలు ఉంటే ఆలివ్ ఆయిల్ వాడటం మంచిది. ఆలివ్ నూనెతో రెండు చుక్కల బాదం నూనె కలిపి గాయం లేదా పొక్కుపై పూయడం ప్రభావవంతంగా ఉంటుంది.
టూత్‌పేస్ట్ వాడాలి
కాలిన గాయాలపై టూత్‌పేస్ట్ పూస్తే ఉపశమనం లభిస్తుంది. కొత్త బూట్లు ధరించినప్పుడు పాదాలపై గాయలు ఏర్పడితే ఉపశమనం కోసం పేస్ట్ ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే బేకింగ్ సోడా, మెంథాల్, పెరాక్సైడ్ గాయాలను నయం చేస్తాయి. కాబట్టి, మీకెప్పుడై చెప్పు కరిస్తే టూత్‌పేస్ట్‌ను పూయడం మర్చిపోవద్దు.
బూట్ల వెనుక భాగంలో దూది ఉంచాలి
చాలా మందికి బూట్లు ధరించడం వల్ల పాదం వెనుక భాగంలో గాయాలు అవుతుంటాయి. ఇది జరగకుండా నిరోధించడానికి, బూట్ల వెనుక కొంచెం కాటన్ ఉంచాలి. ఇలా చేయడం వల్ల కొత్త బూట్లు లేదా చెప్పుల వల్ల కలిగే గాయాలను నివారించవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.








