- Telugu News Photo Gallery Does eating eggs increase my risk of heart disease? Know what do experts say
Heart Disease: రోజు గుడ్డు తింటే గుండె జబ్బులు వస్తాయా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
రోజూ ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని అందరూ అంటుంటారు. కానీ ఇలా మితిమీరి తింటే గుడ్డు వల్ల గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని కొందరు భావిస్తారు. నిజానికి, ఇందులో ఎది నిజమో, ఏది అబద్ధమో చాలా మందికి తెలియదు. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Feb 19, 2025 | 12:30 PM

చిన్న జామకాయను కోసి, నీటిలో బాగా మరిగించి కషాయం తయారు చేసి, మజ్జిగలో కలిపి తాగడం వల్ల కూడా ఛాతీ నొప్పి తగ్గుతుంది.

ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగేకొద్దీ, గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతాయి. చిన్న వయస్సులోనే శరీరంలో కొలెస్ట్రాల్ తిష్టవేస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. గుడ్లు - కొలెస్ట్రాల్ పై తాజాగా పరిపిన ఓ పరిశోధనలో దీనిపై క్లారిటీ ఇచ్చారు పరిశోధకులు.

ఆ పరిశోధన ప్రకారం ప్రతిరోజూ గుడ్లు తినడం అస్సలు ఆరోగ్యానికి ఏ మాత్రం హానికరం కాదు. ఇందుకు విరుద్ధంగా రోజు గుడ్డు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించింది. గుడ్లలో కొవ్వు ఉంటుందని, అయితే ఇది శరీరానికి మంచిదని వైద్యులు కూడా అంటున్నారు.

కాబట్టి ప్రతిరోజూ ఒక గుడ్డు నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ పరిశోధన ప్రకారం, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు గుడ్డులోని పచ్చసొన తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. గుడ్డులోని తెల్లసొనకు లేకుండా తినవచ్చని తెలపారు.

అలాగే గుడ్లను ఎల్లప్పుడూ వేయించకూడదు. ఎందుకంటే నూనెలో వేయించిన గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మరింత పెరుగుతాయి. అందువల్ల, గుడ్లను ఎల్లప్పుడూ ఉడకబెట్టి మాత్రమే తినాలని వైద్యులు చెబుతున్నారు. గుడ్లలో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్ళకు, మెదడుకు చాలా మంచిది.




