AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య ఎక్కువ సంపాదిస్తే.. భర్త మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? సర్వేలో అవాక్కయ్యే విషయాలు..

ఆడవాళ్లు ఆర్థికంగా ఎదిగితే కుటుంబానికి మంచిదే.. కానీ భార్య సంపాదన భర్త కంటే ఎక్కువ ఉంటే ఆ సంసారంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? భార్య జీతం ఎక్కువుంటే విడాకుల రేటు కూడా పెరుగుతుందా? ఈ మార్పును తట్టుకోలేక పురుషులు ఎందుకు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు? అనే ఆసక్తికర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భార్య ఎక్కువ సంపాదిస్తే.. భర్త మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? సర్వేలో అవాక్కయ్యే విషయాలు..
What Happens When Wives Make More Money
Krishna S
|

Updated on: Jul 25, 2026 | 4:03 PM

Share

ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన స్త్రీలు, నేడు పురుషులతో సమానంగా.. అంతకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం సంతోషకరమైన విషయమే అయినా.. ఈ మార్పు దంపతుల మధ్య మానసిక బంధాలపై, ముఖ్యంగా పురుషుల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోందనే దానిపై ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది ఎకనామిస్ట్ ఒక సమగ్ర విశ్లేషణను వెలువరించింది. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

భార్య ఎక్కువ సంపాదిస్తే… భర్తల్లో పెరిగే తీవ్ర ఒత్తిడి..

17 సంవత్సరాల పాటు యువ దంపతుల డేటాను విశ్లేషించిన ఈ స్టడీ ప్రకారం.. కుటుంబం మొత్తం ఆదాయంలో భార్య వాటా 70శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఆ భర్తల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం 2.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వివాహం కాకుండా కలిసి ఉండే జంటలలో కూడా మహిళ సంపాదన 50శాతం దాటినప్పుడు, పురుషుల్లో ఒత్తిడి 1.5 రెట్లు పెరిగినట్లు గుర్తించారు. కుటుంబాన్ని పోషించాల్సింది పురుషుడే.. అనే శతాబ్దాల నాటి సాంప్రదాయ ఆలోచనా విధానం, సమాజం లేదా బంధువుల నుంచి వచ్చే పరోక్ష ఒత్తిళ్లే ఈ అభద్రతాభావానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

డబుల్ బర్డన్‌తో నలిగిపోతున్న మహిళలు..

అధిక సంపాదన కలిగిన మహిళలు ఉన్న కుటుంబాల్లో, దంపతుల మధ్య బంధంలో సంతృప్తి తక్కువగా ఉంటున్నట్లు పరిశోధన వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం.. కాన్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త డాక్టర్ మిస్టీ హెగెనెస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహిళలు ఎంత ఎక్కువ సంపాదించినప్పటికీ, ఇంటి పనులు, పిల్లల పెంపకం, వంట, కుటుంబ వ్యవహారాల నిర్వహణ బాధ్యతలను ఇప్పటికీ స్త్రీలే ఎక్కువగా మోయాల్సి వస్తోంది. ఎక్కువ సంపాదన తెస్తున్నప్పటికీ సమానమైన హక్కు లేదా విశ్రాంతి లభించకపోవడం వల్ల మహిళల్లో నిరాశ పెరుగుతుంది.

అంతర్జాతీయ అధ్యయనాలు ఏం చెప్తున్నాయి?

ఫ్రాన్స్‌లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. కుటుంబ ఆదాయంలో మహిళ వాటా 75శాతం ఉన్న జంటలు విడిపోయే అవకాశం, సమాన ఆదాయం ఉన్న జంటల కంటే 30శాతం ఎక్కువగా ఉంది. చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త మారియన్ బెర్ట్రాండ్ 2015లో చేసిన అధ్యయనంలో.. భార్య సంపాదన భర్త కంటే ఎక్కువ ఉన్న విషయాన్ని వెల్లడించడానికి అనేక జంటలు అభద్రతాభావంతో వెనుకాడతారని తేలింది.

మారుతున్న సామాజిక దృక్పథం

శుభపరిణామం ఏంటంటే.. భార్య ఎక్కువ సంపాదించడం తప్పని భావించే ప్రజల శాతం 1998లో 33శాతానిపైగా ఉండగా, 2022 నాటికి అది 10శాతానికకి పడిపోయింది. అంటే సమాజం మహిళల ఆర్థిక ఎదుగుదలను స్వీకరిస్తున్నప్పటికీ, వ్యక్తిగత సంబంధాలలో ఈ మార్పు పూర్తిస్థాయిలో లీనం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.

Follow Us
భార్య ఎక్కువ సంపాదిస్తే.. భర్త మైండ్‌సెట్ ఎలా ఉంటుంది?
భార్య ఎక్కువ సంపాదిస్తే.. భర్త మైండ్‌సెట్ ఎలా ఉంటుంది?
భగవద్గీత.. జీవితంలో ఆశ కోల్పోయినప్పుడు ధైర్యాన్నిచ్చే 5 అమూల్యమైన
భగవద్గీత.. జీవితంలో ఆశ కోల్పోయినప్పుడు ధైర్యాన్నిచ్చే 5 అమూల్యమైన
29 ఏళ్ల తర్వాత కొడుక్కి బిచ్చగాడిలా కనిపించిన తండ్రి.. కట్ చేస్తే
29 ఏళ్ల తర్వాత కొడుక్కి బిచ్చగాడిలా కనిపించిన తండ్రి.. కట్ చేస్తే
జుట్టు పొడిబారిపోయి గడ్డిలా ఉంటే..అరటి తొక్కను ఇలా అప్లై చేయండి..
జుట్టు పొడిబారిపోయి గడ్డిలా ఉంటే..అరటి తొక్కను ఇలా అప్లై చేయండి..
మీ బీరువా తుప్పుబట్టిందా?.. ఈ చిన్న చిట్కాతో తుప్పు మాయం!
మీ బీరువా తుప్పుబట్టిందా?.. ఈ చిన్న చిట్కాతో తుప్పు మాయం!
మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి
మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి
ఇప్పుడు అమ్మ నా పక్కన ఉంటే బాగుండేది..
ఇప్పుడు అమ్మ నా పక్కన ఉంటే బాగుండేది..
ఈ పేషెంట్లకు కొబ్బరి పువ్వు దివ్యౌషధం.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
ఈ పేషెంట్లకు కొబ్బరి పువ్వు దివ్యౌషధం.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
నాభి దగ్గర పుట్టుమచ్చ ఉందా? సముద్రిక శాస్త్రం చెప్పే ఆశ్చర్యకరమైన
నాభి దగ్గర పుట్టుమచ్చ ఉందా? సముద్రిక శాస్త్రం చెప్పే ఆశ్చర్యకరమైన
పిట్ట కొంచెం.. డ్యాన్స్ అద్భుతం.. లవర్ కోసం కొమ్మపైనే మూన్ వాక్..
పిట్ట కొంచెం.. డ్యాన్స్ అద్భుతం.. లవర్ కోసం కొమ్మపైనే మూన్ వాక్..