AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కేవలం గోళ్లు చూసి మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయొచ్చు.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు..

మీ గోర్లు మీ ఆరోగ్యం గురించి చెబుతాయి. మీకు తగినంత పోషకాహారం అందడం లేదా మీ జీర్ణక్రియ సరిగా లేకపోవడం వంటివి గోర్ల ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో సకాలంలో వైద్యుల దగ్గరికి వెళ్లడానికి వీలు ఉంటుంది. గోర్లు ఇచ్చే సిగ్నల్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Health Tips: కేవలం గోళ్లు చూసి మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయొచ్చు.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు..
చాలా మందికి చేతి, కాళ్ల గోళ్లు విరిగిపోతుంటాయి. కొన్నిసార్లు అవి బలహీనంగా కూడా మారుతాయి. మీ గోళ్లు కూడా ఇలా తరచుగా విరిగిపోతుంటే లేదా బలహీనంగా మారితే ఇది దేనికి సంకేతమో ఇక్కడ తెలుసుకుందాం..
Krishna S
|

Updated on: Sep 19, 2025 | 9:46 PM

Share

మన గోళ్ల ద్వారా మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అవును గోళ్ళు ఒక సిగ్నల్‌గా పనిచేస్తాయి. మీ గోర్లు సాధారణంగా విరిగిపోవడం, రంగు మారడం లేదా వాటిపై వింత మచ్చలు కనిపించడం వంటివి కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇవి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు.

గోళ్లలో కనిపించే మార్పులు

సులభంగా విరిగిపోయే గోర్లు :

చేతులు ఎక్కువసేపు తడిగా లేదా పొడిగా ఉన్నప్పుడు గోర్లు పెళుసుగా మారడం సహజం. కానీ తరచుగా ఇలా జరుగుతుంటే అది థైరాయిడ్ సమస్యలు లేదా ఐరన్లోపానికి సంకేతం కావచ్చు. ఈ సమస్యను నివారించడానికి పాత్రలు కడిగేటప్పుడు లేదా నీటిలో పని చేసేటప్పుడు చేతి గ్లౌజులు ధరించడం, చేతులకు మాయిశ్చరైజర్ రాసుకోవడం మంచిది.

విరిగిన గోర్లు

గోళ్లను టూల్స్‌గా వాడటం, అతిగా గట్టిగా నొక్కడం లేదా నెయిల్ పాలిష్ రిమూవర్ తరచుగా వాడటం వల్ల గోర్లు విరిగిపోతాయి. ఒకవేళ ఐరన్ లోపం వల్ల కాకపోతే ప్రతీ పని తర్వాత నెయిల్ లోషన్‌ను రాసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

గోళ్లపై అడ్డంగా గీతలు

మీ గోళ్లపై అడ్డంగా లేదా వంకరగా గీతలు ఉంటే అది సాధారణమే. కానీ నిటారుగా ఉన్న గీతలు కనిపించినట్లయితే.. అవి కిడ్నీ వ్యాధి లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

గోళ్ల రంగు మారడం

పసుపు రంగులోకి మారడం:

గోళ్లు పసుపు రంగులోకి మారడం సాధారణమే. కొన్నిసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల లేదా నెయిల్ పాలిష్‌లోని రసాయనాల వల్ల ఇలా జరగవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది థైరాయిడ్ సమస్యలు, సోరియాసిస్ లేదా డయాబెటిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. ఈ సమస్యకు టీ ట్రీ ఆయిల్ లేదా విటమిన్ ఇ ఆయిల్ వంటి సహజ పదార్థాలను ఉపయోగించడం వల్ల కొంతవరకు పరిష్కారం లభిస్తుంది.

నల్లని గీతలు:

గోళ్లపై నల్లని లేదా గోధుమ రంగు గీతలను ‘స్ప్లింటర్ హెమరేజ్’ అని పిలుస్తారు. సాధారణంగా ఇవి గాయాల వల్ల ఏర్పడతాయి. కానీ కొన్నిసందర్భాలలో సోరియాసిస్, నెయిల్ మెలనోమా, లేదా ఎండోకార్డిటిస్ వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కూడా సంకేతాలు కావచ్చు.

తెల్లని మచ్చలు:

గోళ్లపై తెల్లని మచ్చలు కనిపించడం జింక్ లోపానికి సూచనగా చాలామంది భావిస్తారు. అయితే ఇవి కొన్నిసార్లు అలెర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా గోరుకు ఏదైనా గాయం అయినప్పుడు కూడా ఏర్పడతాయి. గోళ్లలో ఏవైనా అసాధారణ మార్పులు కనిపిస్తే, వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణుడిని సంప్రదించి సరైన సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us