AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రిడ్జ్ లో వీటిని ఎలా పెడుతున్నారు..? ఏ ఏ రాక్ లలో ఏవి పెడుతున్నారు..?

ఫ్రిడ్జ్ వినియోగంలో ప్రతి ఆహార పదార్థాన్ని ఒకేలా నిల్వ చేయడం సరైన పద్ధతి కాదు. కొన్నింటికి చల్లదనం తప్పనిసరి అయితే, మరికొన్నింటికి అది హానికరం. సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే ఆహారం త్వరగా పాడైపోతుంది. కొన్ని ముఖ్యమైన సూచనలను అనుసరించడం ద్వారా ఆహారాన్ని తాజాగా ఉంచుకోవచ్చు.

ఫ్రిడ్జ్ లో వీటిని ఎలా పెడుతున్నారు..? ఏ ఏ రాక్ లలో ఏవి పెడుతున్నారు..?
Fridge Storage Mistakes
Prashanthi V
|

Updated on: May 14, 2025 | 11:22 AM

Share

ఫ్రిడ్జ్ లో అన్నీ పదార్థాలు ఉంచటం ఆరోగ్యానికి మంచిది కాదన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. కొన్ని వస్తువులు తక్కువ ఉష్ణోగ్రతలలో నిల్వ చేయకపోతే త్వరగా పాడవుతాయి, ఇంకొన్ని మాత్రం చల్లదనంతో నష్టం వాటిల్లుతుంది. అందుకే సరైన రీతిలో నిల్వ చేసే పద్ధతులు తెలుసుకోవడం అవసరం.

బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి వాటిని చల్లని ప్రదేశంలో ఉంచడం వల్ల తేమ చేరి మొలకలు రావడం జరుగుతుంది. ఇవి గదిలో, గాలి చల్లగా ఉండే చోట ఉంచడం మంచిది. అలాగే క్యారెట్, ముల్లంగి, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు మాత్రం తక్కువ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగానే ఉంటాయి.

ఆకుకూరలు నేరుగా ఫ్రిడ్జ్‌ లో ఉంచడం వల్ల తేమ చేరి పాడైపోతాయి. వాటిని మొదటగా శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా తొలగించిన తర్వాతే ఫ్రిడ్జ్‌ లో పెట్టాలి. అలాగే కూరగాయలను ప్లాస్టిక్ కవర్ లేదా గట్టి సంచుల్లో ఉంచడం వల్ల గాలి వెళ్లదీయక పాడైపోతాయి. కాబట్టి కాగితపు సంచులు లేకపోతే పలుచటి కాటన్ బట్టలో చుట్టి పెడితే తాజాగా ఉంటాయి.

తేమ ఉండే పదార్థాలు ఫ్రిడ్జ్‌లో ఉంచినప్పుడు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాలీఫ్లవర్, నారింజ, జామలు, క్యారెట్ వంటి పదార్థాలను వాడే ముందు కడగడం మంచిది కానీ నిల్వ చేసే సమయంలో తడిగా ఉంచకూడదు. శుభ్రంగా తుడిచిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచితే ఎక్కువ రోజులు నిలుస్తాయి.

ఫ్రిడ్జ్ లో ప్రతి రాక్‌ ను అవసరానికి అనుగుణంగా వాడాలి. ఎగువ భాగంలో ఉడకబెట్టిన పదార్థాలు, మధ్య భాగంలో పాలు, పెరుగు వంటి పదార్థాలు ఉంచితే మంచిది. తలుపులో సాస్ బాటిళ్లు, తాగునీరు వంటి వస్తువులకు స్థానం ఇవ్వాలి.

ఏదైనా తినే పదార్థాన్ని ఫ్రిడ్జ్‌ లో పెట్టేటప్పుడు మూత పెట్టకుండా పెడితే దాని వాసన మారిపోతుంది. అంతేకాదు ఆ వాసన వేరే ఆహార పదార్థాలకు కూడా అంటుకొని అవి కూడా పాడైపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఫ్రిడ్జ్‌ లో ఏది పెట్టినా మూత పెట్టి ఉంచాలి.

ఆహారాన్ని క్లాత్, పేపర్ లో చుట్టి నిల్వ చేయడం మంచిదే.. కానీ గట్టిగా చుట్టడం వల్ల గాలి వెళ్లదు. దాంతో వేడి నిలిచిపోతుంది. ఇలా ఉంచిన పదార్థం త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ సూచనలను పాటిస్తే ఫ్రిడ్జ్ వినియోగం వల్ల కలిగే నష్టం నివారించవచ్చు. పదార్థాలు తాజాగా ఉండేలా చూసుకోవచ్చు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్