Boiled Eggs: ఉడకబెట్టిన గుడ్లు ప్రతి రోజూ తింటే ఏం జరుగుతుందంటే..

కోడి గుడ్లు అంటే చాలా మందికి ఇష్టం. గుడ్లతో చేసే ఎలాంటి రెసిపీలు అయినా చాలా రుచిగా ఉంటాయి. కర్రీలు, స్నాక్స్ ఏం చేసినా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎలా వండినా సరే కోడి గుడ్డు కర్రీలు చాలా బావుంటాయి. ఇక ఆమ్లెట్స్‌లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో చెప్పడం కూడా కష్టం. కోడి గుడ్ల చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ అని చెప్పొచ్చు. కేవలం రుచి మాత్రమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ విషయా చాలా మందికి తెలుసు. కానీ ఎలాంటి ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయో..

Boiled Eggs: ఉడకబెట్టిన గుడ్లు ప్రతి రోజూ తింటే ఏం జరుగుతుందంటే..
Eggs
Follow us
Chinni Enni

|

Updated on: Sep 03, 2024 | 1:53 PM

కోడి గుడ్లు అంటే చాలా మందికి ఇష్టం. గుడ్లతో చేసే ఎలాంటి రెసిపీలు అయినా చాలా రుచిగా ఉంటాయి. కర్రీలు, స్నాక్స్ ఏం చేసినా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎలా వండినా సరే కోడి గుడ్డు కర్రీలు చాలా బావుంటాయి. ఇక ఆమ్లెట్స్‌లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో చెప్పడం కూడా కష్టం. కోడి గుడ్ల చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ అని చెప్పొచ్చు. కేవలం రుచి మాత్రమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ విషయా చాలా మందికి తెలుసు. కానీ ఎలాంటి ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయో తెలీదు. ప్రతి రోజూ కోడిగుడ్లను ఉడకబెట్టి తినడం వల్ల చాలా ఉన్నాయి. వీటితో ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కండరాలు ఆరోగ్యం:

కోడి గుడ్లలో హై క్వాలిటీ ప్రోటీన్లు ఉంటాయి. అలాగే అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కండరాల వాపులు, నొప్పులను తగ్గించడంలో ఎంతో చక్కగా సహాయ పడతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

పిల్లల ఎదుగుదల:

ప్రతి రోజూ ఉడకబెట్టిన ఒక కోడిగుడ్డు పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లల్లో చక్కటి ఎదుగుదల ఉంటుంది. ఇందులో మంచి ప్రోటీన్ అందుతుంది. పిల్లలకు ఎనర్జీ కూడా అందుతుంది. కండరాలు, ఎముకలు బలంగా ఉండటంలో, ఎదుగుదలలో కూడా హెల్ప్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎముకలు బలంగా ఉంటాయి:

ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. ఇందులో విటమిన్ డి, బి 12, బి2 రైబోఫ్లేవిన్ ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచేలా చేయడంలో హెల్ప్ చేస్తాయి. శరీరానికి క్యాల్షియాన్ని సరిగా శోషించుకునేలా చేస్తుంది.

కొలెస్ట్రాల్ కంట్రోల్:

కోడి గుడ్లు తినడం వల్ల రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్‌‌ను పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీని వల్ల గుండె కూడా ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది.

కళ్ల ఆరోగ్యం:

ఉడకబెట్టిన గుడ్లు ప్రతి రోజూ తినడం వల్ల కళ్ల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో ఉండే లుటీన్, జియాజాంతిన్ యాంటీ ఆక్సిడెంట్లు.. కళ్లను అతినీల లోహిత కిరణాల నుంచి రక్షిస్తాయి. కంటి శుక్లాలు, దృష్టి లోపాల నుంచి కాపాడుతుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే చర్మ, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండేలా సహాయ పడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..