- Telugu News Lifestyle What happens if you apply coconut oil on your feet? Check Here is Details in Telugu
Coconut Oil for Legs: కొబ్బరి నూనె కాళ్లకు రాస్తే ఏం జరుగుతుందంటే..
కొబ్బరి నూనె ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి బయట పడొచ్చు..
Updated on: Dec 03, 2024 | 6:08 PM

వేసవి కాలం, వర్షా కాలం కంటే చలి కాలంలో చర్మ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. అంతే కాకుండా సీజనల్ వ్యాధులు కూడా దరి చేరుతూ ఉంటాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటివి ఎన్నో సమస్యలు ఎటాక్ చేస్తాయి.

చలి కారణంగా కండరాలు కూడా నొప్పులు వస్తాయి. కాబట్టి ఈ సీజన్‌లో రాత్రి పూట కాళ్లకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి త్వరగా బయట పడొచ్చు. రాత్రి పూట ఆయిల్ రాసి పడుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

రాత్రిపూట పాదాలకు నూనె రాయడం వల్ల పాదాలపై పగుళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. నిద్ర కూడా బాగుంటుంది. వైరస్‌లు,ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది.

అంతే కాకుండా కాళ్లకు ఆయిల్ రాయడం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కాలి వేళ్లు, గోళ్లు తేమగా మారి మెరుస్తాయి. చర్మం మృదువుగా మారుతుంది. పాదాలకు పగుళ్లు వచ్చే అవకాశం తగ్గుతుంది.

Coconut Oil




