AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Problems: సరైన నిద్రలేకుంటే ఏమవుతుంది? లండన్‌ పరిశోధనలో షాకింగ్‌ నిజాలు

Sleeping Problems: నిద్రలేమి ప్రభావం మెదడు పనితీరుపై కూడా ఉంటుందని పరిశోధకులంటున్నారు. ప్రతిరోజూ మెదడులో కొన్ని వ్యర్ధ కణాలు పెరుగుతాయని, నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయని ప్రొఫెసర్ షేన్ ఓమారా పేర్కొన్నారు. అందుకే సరిపడ నిద్రలేకపోతే ఆ వ్యర్ధ కణాలు మెదడులో కొన్ని..

Sleeping Problems: సరైన నిద్రలేకుంటే ఏమవుతుంది? లండన్‌ పరిశోధనలో షాకింగ్‌ నిజాలు
Subhash Goud
|

Updated on: Sep 13, 2025 | 6:00 AM

Share

Sleeping Problems: ఈ రోజుల్లో చాలా మందిలో నిద్ర కరువైపోయింది. రకకాల సమస్యల కారణంగా నిద్రలేమి సమస్యతు కొట్టుమిట్టాడుతున్నారు. శరవేగంగా దూసుకెళుతున్న నేటి తరంలో నిద్రపై శ్రద్ధ తగ్గుతోంది. రాత్రిపూట తక్కువ నిద్ర పోవడంతో దాని ప్రభావం ఉద్యోగంపై, చదువులపై తీవ్రంగా ఉంటోంది. జీవగడియారం సరిగా నడవడానికి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసా? శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఇది కూడా చదవండి: 5 ఏళ్లలో అద్భుతాలు చేసిన 15 రూపాయల స్టాక్‌.. రూ.1 లక్షకు రూ.12 కోట్ల రాబడి

8 ఎనిమిది గంటల నిద్ర

ఇవి కూడా చదవండి

ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటలు నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచస్థాయి ఆరోగ్య సంస్థలు కూడా 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని వయస్సుల వారికి వివిధ రకాల వ్యాధులు ఎలా వస్తాయో చూస్తే.. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచివి కావని పలు అధ్యయనాల్లో తేలింది.

ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర అంటే ఏమిటి ?

6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్ర పోవాలని, చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమికి కారణం అనారోగ్యమని చెప్పడం కష్టమని, కానీ నిద్రలేమి, అనారోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని లండన్‌లో ట్రినిటీ కాలేజ్ ప్రొఫెసర్ షేన్ ఓమారా తెలిపారు. లండన్‌లో నిర్వహించిన పరిశోధనలలో పలు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: Auto News: సెప్టెంబర్‌ 22 తర్వాత ఏ కారు ఎంత తగ్గుతుందో తెలుసా..? పూర్తి వివరాలు

నిద్రలేమి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

నిద్రలేమి సమస్య శరీరంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది. నిద్రలేమిపై అనేక పరిశోధనలు చేశారు పరిశోధకులు. ఇటీవల నిద్రలేమికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 153 అధ్యయనాల్లో 50 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. ఇందులో చాలా మంది నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చాయని గుర్తించారు పరిశోధకులు. యుక్తవయసులో వరుసగా కొన్ని రాత్రులు నిద్రలేకుండా ఉంటే కూడా అది మధుమేహానికి దారి తీస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నిద్రలేమితో రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని, నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని, అంతేకాకుండా తొందరగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఏడు గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయేవారికన్నా, తక్కువ నిద్రపోయేవారికి జలుబు త్వరగా వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.

ఇది కూడా చదవండి: Electric Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 156 కి.మీ ప్రయాణం.. దీన్ని చూస్తేనే కొనేస్తారు!

నిద్రలేమి ప్రభావం మెదడు పనితీరుపై కూడా ఉంటుందని పరిశోధకులంటున్నారు. ప్రతిరోజూ మెదడులో కొన్ని వ్యర్ధ కణాలు పెరుగుతాయని, నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయని ప్రొఫెసర్ షేన్ ఓమారా పేర్కొన్నారు. అందుకే సరిపడ నిద్రలేకపోతే ఆ వ్యర్ధ కణాలు మెదడులో పేరుకుపోతాయని, ఆ పరిస్థితి అలానే కొనసాగితే మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

ఇది కూడా చదవండి: Cockroach: మీ ఇంట్లో బొద్దింకలు పెరిగిపోతున్నాయా? ఈ ట్రిక్స్‌ పాటిస్తే అస్సలు ఉండవు!

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
Money Astrology 2025: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ధనయోగం
Money Astrology 2025: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ధనయోగం
హైదరాబాద్‌ టూ శబరిమల.. 10 ప్రత్యేక రైళ్లు.. ఏయే తేదీల్లో అంటే..!
హైదరాబాద్‌ టూ శబరిమల.. 10 ప్రత్యేక రైళ్లు.. ఏయే తేదీల్లో అంటే..!