AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మగవారు చేసే ఈ తప్పులతో ఆడవాళ్ల ఆరోగ్యం నాశనం.. అవేంటో తెలుసా..?

పురుషులు ప్రతిరోజూ చేసే కొన్ని అలవాట్లు వారి భాగస్వాములైన మహిళల ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. అవును.. మగవారు తమ వ్యక్తిగత పరిశుభ్రతను పట్టించుకోకపోతే అది మహిళల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. మరి ఆ అలవాట్లు ఏమిటీ? అవి ఎందుకు మంచివి కావు అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Health Tips: మగవారు చేసే ఈ తప్పులతో ఆడవాళ్ల ఆరోగ్యం నాశనం.. అవేంటో తెలుసా..?
5 Male Habits That Can Harm Women's Health
Krishna S
|

Updated on: Sep 12, 2025 | 10:08 PM

Share

ఈ ఆధునిక యుగంలో ఆరోగ్యంగా ఉండటం ఒక సవాలుగా మారింది. ఆహారపు అలవాట్లు, కాలుష్యం, చెడు అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే పురుషులు చేసే కొన్ని పొరపాట్లు వారి భాగస్వాముల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం చూపుతాయని మీకు తెలుసా..? దీనికి సంబంధించి ముంబైకి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనన్ వోరా కీలక విషయాలు వెల్లడించారు. పురుషుల ఐదు అలవాట్లు మహిళల ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చని అన్నారు. ఈ అలవాట్లు వారి భాగస్వాములలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు, ముఖ్యంగా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.

ఆ అలవాట్లు ఏంటీ.. వాటి వల్ల వచ్చే సమస్యలేంటీ?

చేతులు క్లీన్ చేసుకోకపోవడం: పురుషులు తమ భాగస్వాముల దగ్గరికి వెళ్ళే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల మహిళల్లో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చేతులపై ఉండే బ్యాక్టీరియా, దుమ్ము వంటివి మూత్ర విసర్జన వంటి సమస్యలకు కారణమవుతాయి.

టాయిలెట్ సీటుపై మూత్ర విసర్జన: బాత్రూమ్ పరిశుభ్రతను పాటించకపోవడం కూడా మహిళల ఆరోగ్యానికి ప్రమాదకరం. పురుషులు టాయిలెట్ సీటును శుభ్రం చేయకపోతే, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వేగంగా పెరిగి.. మహిళలు దానిని ఉపయోగించినప్పుడు వారికి యూటీఐలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా చర్మ దద్దుర్లు వచ్చే అవకాశాలను పెంచుతాయి.

ధూమపానం: ధూమపానం చేసేవారు కేవలం తమ ఆరోగ్యాన్నే కాదు తమ భాగస్వామి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తారు. పరోక్షంగా పొగ పీల్చడం వల్ల మహిళల్లో శ్వాసకోశ వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గర్భిణీ స్త్రీలలో ఇది పిండం అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

స్నానం చేయకపోవడం: బయట పనిచేసే పురుషుల శరీరాలపై చెమట, ధూళి పేరుకుపోతాయి. రోజుకు కనీసం ఒక్కసారైనా స్నానం చేయకపోతే చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. ఒకే బెడ్ షీట్ లేదా మంచం పంచుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా మహిళలకు సోకి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు లేదా దురద వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి రోజుకు రెండుసార్లు స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు ధరించడం అవసరం.

గోళ్లలోని డస్ట్: పురుషుల గోళ్లలో పేరుకుపోయే ధూళి, బ్యాక్టీరియా చర్మ వ్యాధులకు కారణమవుతాయి. ఈ గోళ్లు మహిళల చర్మాన్ని లేదా జననేంద్రియాలను తాకినప్పుడు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం, కత్తిరించుకోవడం చాలా ముఖ్యం. ఈ అలవాట్లు చిన్నవిగా అనిపించినప్పటికీ, అవి మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..