AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోకి గబ్బిలం వస్తే ఏమవుతుంది..? శుభమా.. అశుభమా..? పరిష్కార మార్గాలు తెలుసుకోవాల్సిందే..!

పెద్దల మాటలను పాటిస్తే మంచి జరుగుతుందని అనేక మంది నమ్ముతారు. హిందూ సంస్కృతిలో కొన్ని విశ్వాసాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. ఉదాహరణకు బల్లి మీద పడితే ఏమవుతుంది..? కాకి ఇంటి ముందు అరిస్తే ఏమవుతుంది..? లాంటి నమ్మకాల వెనుక కొన్ని ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి.

ఇంట్లోకి గబ్బిలం వస్తే ఏమవుతుంది..? శుభమా.. అశుభమా..? పరిష్కార మార్గాలు తెలుసుకోవాల్సిందే..!
Bat In House
Prashanthi V
|

Updated on: Feb 21, 2025 | 3:36 PM

Share

ఇంట్లోకి కొన్ని జంతువులు, పక్షులు ప్రవేశించినప్పుడు వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంట్లోకి కాకి, గబ్బిలం వంటి జంతువులు వస్తుంటాయి. అయితే వీటి ప్రవేశం మంచిదా..? లేదా దేనికైనా సూచనగా ఉందా..? అనే విషయం తెలుసుకోవడం అవసరం.

ఇంట్లోకి కాకి

పెద్దల మాట ప్రకారం ఇల్లు దేవాలయంలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే మనశ్శాంతి తగ్గి గొడవలు జరుగుతాయని పురాణాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ఇంట్లోకి కాకి వస్తే అది దరిద్రానికి సంకేతంగా భావించబడుతుంది. శనీశ్వరుడి వాహనంగా కాకిని పూజిస్తారు కానీ, అది ఇంట్లోకి రావడం శుభప్రదంగా పరిగణించరు. కొన్ని నమ్మకాల ప్రకారం కాకి ఇంట్లోకి వచ్చినప్పుడు చెడు వార్తలు వచ్చే అవకాశముందని భావిస్తారు.

ఇంట్లోకి గబ్బిలం

గబ్బిలం కూడా ఇంట్లోకి రావడం అశుభానికి సంకేతంగా చెబుతారు. ఇది చెడు శక్తులు ప్రభావం చూపుతున్నాయని సూచించవచ్చని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఆ కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశముందని ఎలాంటి చెడు శక్తుల ప్రభావం ఉందో పరీక్షించుకోవాలని సూచిస్తారు.

దోష నివారణ ఎలా చేయాలి..?

ఇలాంటి దోషాలను తొలగించేందుకు కొన్ని మార్గాలను అనుసరించాలని పెద్దలు సూచిస్తారు. ఇంట్లోకి గబ్బిలం లేదా కాకి ప్రవేశించినప్పుడు తదుపరి రోజు కుటుంబ సభ్యులందరూ తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు గోమూత్రం, తులసి ఆకులు, కొంచెం మట్టి కలిపిన నీటిని ఉపయోగించడం మంచిదని చెబుతారు. ఇంటి మొత్తం శుభ్రం చేసేందుకు గోమూత్రం, పసుపు, కర్పూరం కలిపిన నీటిని ఉపయోగించి ఇల్లంతా శుభ్రపరచుకోవాలి.

ప్రత్యేక పద్ధతులు

ఇంటి మధ్యలో బియ్యం పిండితో నక్షత్ర ఆకారంలో ముగ్గు వేసి దానిపై విస్తరాకును ఉంచాలి. ఆ విస్తరాకుపై సముద్ర ఉప్పు ఉంచి మట్టి ప్రమిదలో మూడు వత్తులు పెట్టి ఆముదం పోసి దీపాన్ని వెలిగించాలి. దీపం పూర్తిగా కరిగిన తర్వాత, విస్తరాకు, దీపం, ఉప్పును ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వదిలేయాలి.

ఇంటి దైవానికి పూజ

ఇంట్లోని సభ్యులు ఇంటి దైవానికి సంబంధించిన ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోవాలి. అక్కడి తీర్థాన్ని ఇంటికి తీసుకురావాలి. ఆ తీర్థాన్ని తులసి ఆకుతో అందరిపై చల్లి, ఇంట్లో కూడా ప్రోచుకోవాలి. అలాగే ఇంట్లో సాంబ్రాణి పొగ వేయడం ద్వారా చెడు శక్తులు తొలగిపోతాయని చెబుతారు.

ఇంట్లో చీమలు

ఇంట్లో చీమలు కనిపించడం కూడా కొన్నిరకాల సంకేతాలను సూచించవచ్చు. నల్ల చీమలు ఎక్కువగా ఉంటే, అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. ఇది కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందనే నమ్మకం ఉంది. కానీ, ఎర్ర చీమలు ఎక్కువగా కనిపిస్తే, ఖర్చులు అధికమవుతాయని, ధనం కరిగిపోతుందని పెద్దలు చెబుతారు.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)

Follow Us