పెరుగు తినడానికి కరెక్ట్ సమయం ఏది? ఆ టైమ్‌లో మాత్రం  అస్సలు తినొద్దు

 Krishna

16 June 2026

రాత్రి సమయాల్లో మన శరీర జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి రాత్రి పూట దీనిని తినడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

జీర్ణక్రియ

ఆయుర్వేదం ప్రకారం రాత్రి వేళల్లో శరీరంలో సహజంగానే కఫ దోషం పెరుగుతుంది. పెరుగులో ఉండే గుణాల వల్ల ఇది కఫాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. అందుకే రాత్రిపూట తినకపోవడం మంచిది.

కఫం

రాత్రి పూట పెరుగు తినడం వల్ల గొంతులో జిగట పేరుకుపోయే అవకాశం ఉంది. దీనివల్ల ఉదయాన్నే జలుబు, దగ్గు, సైనస్ లేదా అస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది పెరుగుతుంది.

శ్వాసకోశ సమస్యలు

రాత్రి పూట క్రమం తప్పకుండా పెరుగు తినడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి, మోటిమలు, అలర్జీల వంటి చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చర్మ సమస్యలు

పెరుగులో ఉండే పులుపు, చలవ చేసే గుణాల కారణంగా రాత్రి పూట దీనిని తీసుకుంటే కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవారికి నొప్పులు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

కీళ్ల నొప్పులు

ఉదయం లేదా మధ్యాహ్నం.. పెరుగు తినడానికి ఇది బెస్ట్ టైమ్. ఈ సమయంలో మన జీర్ణక్రియ చాలా బలంగా ఉంటుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణశక్తిని పెంచడానికి, రోజంతా యాక్టివ్‌గా ఉంచడానికి బాగా పనికొస్తాయి.

ఎప్పుడు తినాలి..?

ఒకవేళ రాత్రి పూట పెరుగు తినడం తప్పనిసరైతే, అందులో కొద్దిగా పంచదార, మిరియాల పొడి లేదా జీలకర్ర పొడి కలిపి తీసుకోవడం మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

రాత్రి తినాల్సి వస్తే

రాత్రి వేళల్లో పెరుగుకు బదులుగా పల్చటి మజ్జిగను తీసుకోవడం చాలా సురక్షితం. మజ్జిగ శరీరాన్ని చల్లబరచడమే కాకుండా సులభంగా జీర్ణమవుతుంది.

మజ్జిగ